వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ హామీ, టీడీపీ ఎంపీ రివర్స్ గేర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండేళ్లలో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. ఒక్క హైదరాబాద్‌లోనే పేదలకు 10 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు.

జీవో 58 కింద ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్న పేదలకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంబిటి నగర్‌లో 10,300 క్రమబద్ధీకరణ పట్టాలను ముఖ్యమంత్రి పంపిణి చేశారు.

కాగా, మల్కాజిగిరి సభలో టీడీపీ ఎంపీ మల్లారెడ్డి.. కేసీఆర్ పైన పొగడ్తల వర్షం కురిపించారు. ఇంతమంచి సీఎం ఉండటం ప్రజల అదృష్టమని, ఇలాంటి నేతను చూడలేదని, చాలా కష్టపడుతున్నారని, బంగారు తెలంగాణ కోసం అందరు ఆయనకు సహకరించాలన్నారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిని ఆయన ఖండించారు.

 పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

మల్కాజిగిరి, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంబిటి నగర్‌లో 10,300 క్రమబద్ధీకరణ పట్టాలను ముఖ్యమంత్రి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వాలు పేదలకు అంగుళం స్థలం కూడా ఇవ్వకుండా పేకాట క్లబ్‌లకు, రేసు కోర్టులకు ఎకరాల కొద్ది స్థలాలు ఇచ్చాయన్నారు.

పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

తమ ప్రభుత్వం పేదల ఇళ్లకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మలక్‌పేట రేసు కోర్స్‌ను నగరం అవతలికి తరలించి రేస్ కోర్స్ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించబోతుందని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో పేదవాడు ఉండటానికి గుడిసె వేసుకుంటే అధికారులు వచ్చి బుల్‌డోజర్లను తీసుకొచ్చి కూల్చేవాళ్లన్నారు. ఇవాళ పేదల గోస తెలిసిన వారు ప్రభుత్వం నడుపుతుండటంతో వారు నిర్మించుకున్న ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తుందన్నారు.

పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

గతంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన ఒక పెద్ద మనిషి పేదల భూమిని ఆక్రమించుకొని ఫ్యాక్టరీ నిర్మించుకున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. కాంగ్రెస్ కార్యాలయం కోసం పేదల ఇళ్లను కూల్చేసిన ఘనత వారిది అయితే, పేదల కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రభుత్వం తమదని అన్నారు. పేదలు ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు.

పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

వందకు వంద శాతం పేదల బాధలు తీర్చేందుకు కట్టుబడి ఉన్నామని, పేదల కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. లంచాలకు తావు లేకుండా ప్రభుత్వమే ఇంటింటికీ తిరిగి పట్టాలను పంపిణీ చేస్తుందన్నారు. పేదలు బాగు పడ్డప్పుడే వచ్చిన తెలంగాణ రాష్ట్రం సార్థకం అవుతుందన్నారు. జీవితంలో మంచి పని చేసే అవకాశం అందరికీ రాదని, ఇవాళ తనకు ఆ అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.

పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

ప్రభుత్వం పేరు మీద ఉన్న భూములను పేదలకు ఇవ్వడం తనకో గొప్ప అనుభూతి కలిగిస్తుందన్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే లక్ష మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, వాటి విలువ 10 వేల కోట్లపైనే ఉంటుందన్నారు. తమకు పట్టాలు ఇవ్వలేదని ఎవరు కూడా మనసు చిన్నబుచ్చుకోవద్దని, వారికి కూడా త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.

 పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

కోర్టు కేసులను త్వరగా తేల్చడానికి ప్రత్యేకంగా న్యాయవాదులను నియమిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో రెండు లక్షల మందికి, రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో యాబై వేల ఇళ్లను నిర్మించి ఇస్తామని, దీని కోసం రెండు వేల ఎకరాలను సేకరిస్తామన్నారు. ముఖ్యమంత్రి వెంట కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

కేసీఆర్ గద్దర్ పేరును కూడా ప్రస్తావించారు. గద్దరన్న ప్రజల కోసం కొట్లాడే మనిషి అని, అల్వాల్లో పేదలకు ఇళ్లు రాలేదని ఆయన భార్య విమలక్క తనకు లేఖ రాసిందని, తనకు సంతోషం కలిగిందని, ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నానని, అక్కా నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు కాన నీ లేఖ ప్రకారం 100 శాతం పేదలకు ఇళ్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నానని కేసీఆర్ అన్నారు.

పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు మల్లా రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ మంచి ముఖ్యమంత్రి అని ఆయన శుక్రవారం నాడు కితాబిచ్చారు.

 పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

మల్కాజిగిరి నియోజకవర్గంలో పేదలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ మంచి ముఖ్యమంత్రి అన్నారు.

 పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

కష్టపడే, న్యాయమైన ముఖ్యమంత్రి అని చెప్పారు. అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రికి అందరు సహకరించాలని కోరారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో మల్లారెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

English summary
Chief Minister K Chandrasekhar Rao on Friday set the ball rolling on his ambitious programme of distributing a whopping 1.25 lakh pattas to the poor across the State, said to be a never-before welfare initiative since Independence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X