• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రియమైన శత్రువు.!బీజేపిని పెంచాలి, కాంగ్రెస్ ను తుంచాలి.!కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ రెడ్డి తెలంగాణ పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రేవంత్ తో పోల్చుకుంటూ రాజకీయాల్లో వెనకబడకూదనే భావంతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి ఇతర పార్టీలు. తెలంగాణలోని ప్రధాన పార్టీలు పైకి శత్రుత్వం నటిస్తూనే అంతర్గతంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ - టీఆర్ఎస్ మాధ్య తెలంగాణలో నడుస్తోన్న పొలిటికల్ గేమ్ వారిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగం అని తెలంగాణ కాంగ్రెస్ ఘాటుగా ఆరోపిస్తోంది.

 సంచలనం రేపుతోన్న సర్వే..బీజేపీని కేసీఆర్ పెంచే ప్రయత్నం అందుకేనా.

సంచలనం రేపుతోన్న సర్వే..బీజేపీని కేసీఆర్ పెంచే ప్రయత్నం అందుకేనా.

కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణను రాజకీయ అవసరం కోసం యథాలాపంగా చేసిందా.? లేక విషయ పరిజ్ఞానంతో చేశారో తెలియదు కానీ, ఓ మైండ్ బ్లోయింగ్ విషయం ఇప్పుడు టీఆర్ఎస్ సన్నిహిత వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ విషయం ఆ చెవిన ఈ చెవిన పడి చర్చలోకి వచ్చింది. ఆ సీక్రెట్ తెలిశాక సీఎం చంద్రశేఖర్ రావు గేమ్ ప్లాన్ లో భాగంగానే బీజేపీని పెంచుతున్నారేమో అన్న డౌట్ ఐతే రాకమానదు. ఇంతకీ ఏమిటా బ్లాస్టింగ్ సీక్రెట్.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా పది రోజుల క్రితం సీఎం చంద్రశేఖర్ రావు చేతికి ఓ కీలక సర్వే నివేదిక అందింది. ఆ సర్వే నివేదికలోని అంశాలు చూస్తే మైండ్ బ్లోయింగ్ అని టీఆర్ఎస్ నేతల్లో చర్చ మొదలైంది. ఆ నివేదికలోని సారాంశం తమకు నమ్మలేని నిజంగా కనిపిస్తోందంటున్నారు గులాబీ నేతలు. ఇంతకీ ఆ సర్వే నివేదిక సారాంశం ఇదే..

 సర్వేల ప్రకారం వ్యూహాలు.. కేసీఆర్ స్కెచ్ అదే

సర్వేల ప్రకారం వ్యూహాలు.. కేసీఆర్ స్కెచ్ అదే

ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 75 నుంచి 83 సీట్లు ఖాయమని, చాలా చోట్ల టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కు పోతోందన్నది టీఆర్ఎస్ లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మామూలుగా ఐతే ఇది అంత నమ్మదగ్గ అంశంగా కనిపించడం లేదు. కానీ, సీఎం చంద్రశేఖర్ రావు చేయించే సర్వేలు ఆషామాషీగా ఉండవు. పక్కాగా పకడ్బందీగా చేయిస్తారాయన. సర్వే సంస్థలు కూడా ఆయనకు నివేదిక ఇవ్వడానికి ముందు ఒకటికి పది సార్లు అన్నీ లెక్కలు సరి చూసుకుని అందజేస్తాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని కూడా సర్వేలో స్పష్టంగా తెలిసిన తర్వాతే సీఎం చంద్రశేఖర్ రావు అరివీరభయంకరమైన హామీలన్నీ గుప్పించారు.

 తెలంగాణలో గులాబీకి ప్రతకూల సర్వే... కేసీఆర్ హడావిడి అందుకే

తెలంగాణలో గులాబీకి ప్రతకూల సర్వే... కేసీఆర్ హడావిడి అందుకే

తాజాగా సీఎం చంద్రశేఖర్ రావు చేతికి చేరిన సర్వే నివేదిక మాత్రం ఆయన కూడా నమ్మలేని లెక్కలు చూపిస్తోందట. దీంతో అలెర్ట్ అయిన చంద్రశేఖర్ రావు తిరిగి ప్రజాభిమానం కారు వైపు మళ్లించేందుకు ద్విముఖ వ్యూహంతో ప్రణాళిక రచించినట్టు చెబుతున్నారు. వరుసగా ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ కు పిలుచుకుని క్లాస్ పీకుతున్నారట. వచ్చే రోజుల్లో వారానికి ఆరు రోజులు నియోజకవర్గాలలోనే ఉండాలని హుకూం జారీ చేశారట. కాదని ఎవరైనా హైదరాబాద్ లేదా వేరే ప్రాంతాలలో చక్కర్లు కొట్టినట్టు తెలిస్తే సీటు హుష్ ఫటక్ అని హెచ్చరించారట. అదే సమయంలో కాంగ్రెస్ కు కౌంటర్ గా రాష్ట్రంలో బీజేపీని పెంచే ప్రణాళికకు పదును పెట్టినట్టు సమాచారం.

 ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో ఉండాలి.. హుకుం జారీ చేసిన గులాబీ బాస్

ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో ఉండాలి.. హుకుం జారీ చేసిన గులాబీ బాస్

తాను ఎంత లేపినా బీజేపీ ఓ స్థాయి దాటి తెలంగాణలో పికప్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ సమీకరణాలు అట్లాంటివి. తెలంగాణ సమాజం బేసిక్ గా బీజేపీకి వ్యతిరేకం. బోధన్, బైంసా, కరీంనగర్ లాంటి కొన్ని స్పెసిఫిక్ ప్రాంతాలు మినహాయిస్తే మిగతా చోట్ల బీజేపీ బలం పుంజుకోవడం అంతే తేలికైన విషయం కాదు. ఐతే... బీజేపీకి కొంత పికప్ అయితే యాంటీ ఇన్ కంబెన్సీ ఓట్లు చీల్చడంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందన్నది సీఎం చంద్రశేఖర్ రావు అంచనాగా తెలుస్తోంది. తాత్కాలికంగా బీజేపీ పెరిగితే ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ కు బదులు బీజేపీని ఫిక్స్ చేయొచ్చని చంద్రశేఖర్ రావు అంచనా వేసి ఉండవచ్చంటున్నారు. ఈ వ్యూహంతోనే రాష్ట్ర బీజేపీతో స్ట్రీట్ ఫైట్ కు చంద్రశేఖర్ రావు దిగినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 ప్రియమైన శత్రువు.. బీజేపితో అందుకే కయ్యం

ప్రియమైన శత్రువు.. బీజేపితో అందుకే కయ్యం

వాస్తవానికి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడై రెండేళ్లు దాటిపోయింది. సహజంగానే ప్రతిపక్ష నేతలను చంద్రశేఖర్ రావు హీనంగా చూస్తారు. బండి సంజయ్ ను కూడా సీఎం చంద్రశేఖర్ రావు చాలా చిన్నగానే చూశారు. కానీ, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత చంద్రశేఖర్ రావు వ్యూహాత్మకంగా సంజయ్ ను తన ప్రత్యర్థిగా నిర్దారించుకున్నారు. అక్కడ నుంచి సంజయ్ ను ప్రతి ప్రెస్ మీట్ లో పేరు తీసుకుని మరీ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. 317 జీవో పై బీజేపీ జాగరణదీక్షను చంద్రశేఖర్ రావు అవకాశంగా మలచుకున్నట్టు అనిపిస్తోంది. బండి సంజయ్ దీక్ష చేసే స్థలం ఆయన క్యాంపు కార్యాలయం. క్యాంపు కార్యాలయం అంటే దాదాపు ఇల్లుతో సమానం. అంటే ఆయన ఇంట్లో ఆయన దీక్ష చేసుకుంటున్నట్టు లెక్క. అలాంటి చోట దీక్షకు అనుమతి లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను రంగ ప్రవేశం చేయించింది.

 బీజేపినీ పెంచాలి.. కాంగ్రెస్ ను తుంచాలి.. ఇదే కేసీఆర్ వ్యూహమా.?

బీజేపినీ పెంచాలి.. కాంగ్రెస్ ను తుంచాలి.. ఇదే కేసీఆర్ వ్యూహమా.?

సంజయ్ క్యాంపు కార్యాలయం గేట్లను గ్యాస్ కట్టర్లతో కట్ చేయించి మరీ అరెస్టు చేయించి హైప్ తీసుకొచ్చింది. ఆల్రెడీ అప్పటికే ఆర్ఎస్ఎస్ సమావేశాల కోసం హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావాల్సిన షెడ్యూల్ ఖరారైంది. అదే సమయంలో సంజయ్ ఇష్యూ కూడా జరగడంతో బీజేపీ సీన్ ను ఇటు తిప్పింది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతానికి ఆ ఇద్దరికీ ఉభయతారకంగానే కనిపిస్తోంది. కాకపోతే చంద్రశేఖర్ రావు రచించిన ఈ యుగళ వ్యూహం ఏ మేరకు వర్కవుట్ అవుతుంది. ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టగలదా... తనకు పబ్లిక్ లో ఇప్పటికే ఫాం అయిన ఇమేజ్ ను కాంగ్రెస్ కాపాడుకోగలదా... చంద్రశేఖర్ రావు గేమ్ ప్లాన్ లో భాగంగా బీజేపీని పెంచుతున్నాడన్న తన ఆర్గ్యూమెంట్ ను పబ్లిక్ లోకి తీసుకువెళ్లి కౌంటర్ చేయగలదా అన్నదే ప్రశ్నార్ధకం.

English summary
Special conditions prevailed in Telangana politics. The political landscape of Telangana changed completely after Revant Reddy took the reins of Telangana. Other parties are showing aggression with the feeling that they should not be left behind in politics as compared to Revant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X