హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ గొప్ప మనసు.. రోడ్డుపై ఆ వృద్దుడిని చూసి కారు ఆపి..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. టోలీచౌకీలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో రోడ్డుపై ఓ వికలాంగ వృద్దుడిని చూసి కారు ఆపారు. చేతిలో దరఖాస్తు పట్టుకుని నిలబడటంతో.. డ్రైవర్‌ను కారు ఆపమన్నారు.

Recommended Video

Telangana CM KCR Stops Convoy For Disabled Man | He Is The People Leader | Oneindia Telugu

ఆపై కారు నుంచి దిగి.. దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా మాట్లాడారు. తన పేరు సలీమ్ అని చెప్పిన ఆ వృద్దుడు.. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పాడు. గతంలో డ్రైవర్‌గా పనిచేసినట్టు తెలిపాడు.

kcr sucha a kind hearted cm stops convoy and helps to an old man

సలీం నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ఆయన సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేత మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో టోలిచౌకీలోని సలీమ్‌ ఇంటికి వెళ్లిన కలెక్టర్‌ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జియాగూడ పరిధిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు మంజూరు చేశారు. సలీమ్‌కు సదరం సర్టిఫికెట్‌ ఉండటంతో వికలాంగుల పెన్షన్‌ కూడా మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సలీమ్‌కు అవసరమైన వైద్య పరీక్షలు,చికిత్స ప్రభుత్వం తరుపున అందిస్తామని హామీ ఇచ్చారు.

English summary
Returning to Pragathi Bhavan from a private event in Tolichowki,suddenly CM KCR stops his convoy.After that he went to an old man who stands beside road,talked to him and ordered officials to help him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X