ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బలుపుంటే.., చిన్నకులంలో పుట్టా, చిరు పార్టీని పడేసారు, ఎన్టీఆర్ గ్రేట్: కేసీఆర్, పరిటాల పెళ్లిపై..

భారీ వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాదులో జనజీవనం స్తంభించడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీనిపై సీఎం కేసీఆర్ శుక్రవారం గట్టి కౌంటర్ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారీ వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాదులో జనజీవనం స్తంభించడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీనిపై సీఎం కేసీఆర్ శుక్రవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో కలెక్టర్లకు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు విభేదాలపై స్పందిస్తూ.. అవి సహజమేనని, రానున్న కాలంలో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు.

నా వల్లే నువ్విలా, నేరుగా రా: కోదండపై కేసీఆర్ అటాక్, ఉద్యమం క్రెడిట్ నాదేనా వల్లే నువ్విలా, నేరుగా రా: కోదండపై కేసీఆర్ అటాక్, ఉద్యమం క్రెడిట్ నాదే

బలుపు ఉంటే దొర, చిన్న కులంలో పుట్టు

బలుపు ఉంటే దొర, చిన్న కులంలో పుట్టు

నేను చిన్న కులంలో పుట్టానని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ బలహీన వర్గాల రాష్ట్రమని చెప్పారు. బలుపు ఉన్నోడే దొర అని కేసీఆర్ చెప్పారు. దొర అన్నది ఓ కులం కాదన్నారు. నేను మంత్రి కావడానికి 13 ఏళ్లు పట్టిందని చెప్పారు.

తెలంగాణలో టిడిపి లేదు

తెలంగాణలో టిడిపి లేదు

తెలంగాణలో టిడిపి లేనే లేదని కేసీఆర్ చెప్పారు. ప్రతి రోజూ టిడిపితో గొడవలు తప్పడం లేదని వ్యాఖ్యానించారు. పాలనలో పొరపాట్లు జరగకుండా ఉండవని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు.

జీఎస్టీ ఓ మంచి ప్రయోగం

జీఎస్టీ ఓ మంచి ప్రయోగం

జీఎశ్టీ ఓ మంచి ప్రయోగం అని, కానీ అది ఫెయిలవుతుందా, సక్సెస్ అవుతుందా చెప్పలేమని కేసీఆర్ అన్నారు. సింగరేణి ఎన్నికల్లో బిజెపికి 240 ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. అలాంటి వాళ్లు మేం తెలంగాణలో ప్రత్యామ్నాయం అని చెప్పడం విడ్డూరమన్నారు.

హైదరాబాద్‌లో వర్షం.. కేసీఆర్ స్పందన

హైదరాబాద్‌లో వర్షం.. కేసీఆర్ స్పందన

బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోను భారీ వర్షాలు వచ్చాయని, ఆ నగరాలు కూడా వర్షంతో సతమతమయ్యాయని కేసీఆర్ గుర్తు చేసారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలాగే ఉంటుందన్నారు. గత పాలకుల వల్లే ఇలా జరుగుతోందన్నారు. హైదరాబాదులో నాలాలను కబ్జాకు గురి చేసిందెవరని ప్రశ్నించారు. సీఎం, మంత్రులపై పిచ్చికూతలు కూయవద్దని, విమర్శలు, హద్దులు దాటవద్దని మండిపడ్డారు.

అందరికీ ఉద్యోగాలు సాధ్యం కాదు

అందరికీ ఉద్యోగాలు సాధ్యం కాదు

సింగరేణి కార్మికులకు బోర్డులో స్థానం కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు. ఆర్టీసీ, సింగరేణి వంటి సంస్థలను ప్రభుత్వ సంస్థలుగా కాపాడుతామని చెప్పారు. కోటి ఉద్యోగాలు అంటే, కేంద్ర ప్రభుత్వంలోనే అన్ని ఉద్యోగాలు లేవన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదన్నారు. ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అవినీతి తగ్గిందని వ్యాపారులు మెచ్చుకుంటున్నారని చెప్పారు. బయ్యారంను సింగరేణికి అప్పగిస్తామని, సింగరేణిని విస్తరిస్తామని చెప్పారు.

డిఎస్సీకి తొందరేముంది

డిఎస్సీకి తొందరేముంది

డీఎస్సీకి తొందర ఏముందని కేసీఆర్ ప్రశ్నించారు. త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు సింగరేణిని నాశనం చేశాయన్నారు. సింగరేణి విషయంలో గతంలో చేసిన తప్పులు జరగవన్నారు. ప్రతిపక్షాలు సింగరేణి ఫలితాల తర్వాతనైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

పరిటాల రవి మిత్రుడు, పెళ్లికి వెళ్తే తప్పా?

పరిటాల రవి మిత్రుడు, పెళ్లికి వెళ్తే తప్పా?

పరిటాల శ్రీరామ్ పెళ్లికి నేను వెళ్తే తప్పేమిటని కేసీఆర్ ప్రశ్నించారు. పరిటాల రవి, తాను కలిసి పని చేశామని చెప్పారు. పరిటాల రవి తనకు మంచి మిత్రుడు, అత్మీయుడు అన్నారు. మిత్రుడి కొడుకు పెళ్లికి వెళ్తే తప్పేమిటని ప్రశ్నించారు. అన్నా నా కొడుకు పెళ్లికి రా అని మంత్రి సునీత పిలిచారని, అందుకే వెళ్లానని చెప్పారు.

చిరంజీవి పార్టీని కట్టి పడేశారు, ఎన్టీఆర్ గ్రేట్

చిరంజీవి పార్టీని కట్టి పడేశారు, ఎన్టీఆర్ గ్రేట్

పార్టీ పెట్టడం అంత సులభం కాదని కేసీఆర్ అన్నారు. కోదండ పార్టీ పెడతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన స్పందించారు. చిరంజీవి పార్టీ పెడితే ప్రజలు ఆ పార్టీని కట్టెల మోపును కిందపడేసినట్లు పడేశారన్నారు. ఎవరికి వారు పార్టీలు పెట్టుకుంటే ఆ పార్డీలు నడవవని చెప్పారు. ఎన్టీఆర్ మూడుతరాల నటుడని, తెలుగు ప్రజల మద్దతుతో సరైన సమయంలో పార్టీ పెట్టారని, గొప్పవారు అయ్యారన్నారు. ఎన్టీఆర్‌కు ప్రజల్లో విశ్వసనీయత ఉందన్నారు. కోదండ ఓ పాట ప్రచారం చేస్తున్నారని, ఎవడు ఏలుతున్నాడని తెలంగాణను అని అందులో ఉందని, ప్రజలు ఎన్నుకున్న వారే రాష్ట్రాన్ని ఏలుతున్నారని కోదండకు అంత కడుపు మంట అన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao talks about Hyderabad Rain, Dora, TDP and Paritala Sriram Wedding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X