• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ ది క్రూరత్వంతో కూడుకున్న క్రిమినల్ బ్రెయిన్.!ఢీ కొట్టడం అసాద్యం.!కానీ.,రేవంత్ మరో సంచలనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన అంశాలను వెల్లడించారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల గురించి, గడిచిన ఉప ఎన్నికల గురించి, సీఎం చంద్రశేఖర్ రావు ఆలోచనా విధానాల గురించి, ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపి గురించి, బండి సంజయ్ గురించి, రామానుజల స్వామి వారి సమత విగ్రహ ప్రతిష్టాపన గురించి ఆసక్తికర అంశాలను ప్రస్థావించారు. రాజకీయ నాయకుల భవితవ్యం, ప్రజల మనోభావాలు గురించికూడా కీలక వ్యాఖ్యలు చేసారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ ను పదవినుండి తప్పించడం అసాద్యం.. కానీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్

కేసీఆర్ ను పదవినుండి తప్పించడం అసాద్యం.. కానీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్

ముఖ్యంగా సీఎం చంద్రశేఖర్ రావు ఆలోచనా విధానం గురించి సంచలన అంశాలను ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. రాజకీయ అవకాశాలను ఎలా అందిపుచ్చుకుంటారు, అందిపుచ్చుకున్న తర్వాత పదవిని ఎలా కాపాడుకోవాలి, పదవి కాపాడుకునే క్రమంలో ఎలాంటి వ్యూహంతో ఉండాలి అనే అంశాలు చంద్రశేఖర్ రావు సామాజిక వర్గానికి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదని సంచలన వ్యాఖ్యలు చేసారు రేవంత్ రెడ్డి. రాజకీయ పదవులు చేజారిపోకుండా ఉండే అంశాల పట్ల ఎలాంటి మెలకువలు పాటిస్తారో ఆసక్తికరంగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.

పదవి కాపాడుకోవడంలో ఎన్నో వ్యూహాలు.. వచ్చే ఎన్నికలు రసవత్తరమన్న టీపిసిసి ఛీఫ్

పదవి కాపాడుకోవడంలో ఎన్నో వ్యూహాలు.. వచ్చే ఎన్నికలు రసవత్తరమన్న టీపిసిసి ఛీఫ్

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు క్రూరత్వంతో కూడుకున్న కఠోరమైన ఆలోచనలు చేస్తాడని, ఆయన దగ్గరనుండి పదవిని గుంజుకోవడంగానీ, పదవీచ్యుతుడిని చేయడంగానీ అంత సులువైన పని కాదని రేవంత్ అన్నారు. పదవిని కాపాడుకునే క్రమంలో ఎంతటి ఎత్తులకైనా, జిత్తులకైనా పాల్పడతారని, ఒక్కోసారి అత్యంత ప్రమాదకరంగా కూడా ఆలోచిస్తారని పేర్కొన్నారు. సామాన్య రాజకీయ నాయకులెవ్వరూ కూడా చంద్రశేఖర్ రావుతో వైరానికి దిగలేరని, అలా చేస్తే చంద్రశేఖర్ రావు సులువుగా మట్టికరిపిస్తాడని రేవంత్ సంచలన అంశాలను వెల్లడించారు.

ప్రజల దృష్టిని మళ్లించడంలో కేసీఆర్ దిట్ట.. వినూత్న వ్యూహాలకు చెక్ పెట్టేది తనేనన్న పీసిసి ఛీఫ్

ప్రజల దృష్టిని మళ్లించడంలో కేసీఆర్ దిట్ట.. వినూత్న వ్యూహాలకు చెక్ పెట్టేది తనేనన్న పీసిసి ఛీఫ్

అంతే కాకుండా ప్రజలను ఏమార్చడంలో చంద్రశేఖర్ రావు నైపుణ్యం వేరని, ప్రజల దృష్టిని మళ్లించడంలో చంద్రశేఖర్ రావు తర్వాతే ఎవరైనా అని రేవంత్ తెలిపారు. వాస్తవాలను కప్పిపుచ్చి తాను చెప్పిందే వేదం అనే రీతిలో సీఎం వ్యవహారం ఉంటుందని రేవంత్ అన్నారు. ప్రత్యర్థుల పట్ల, రాజకీయ విరోధుల పట్ల చంద్రశేఖర్ రావు అవలంభించే విధానాలు చాలా వైవిద్యంగా, కఠినంగా ఉంటాయని తెలిపారు. అనుభవిస్తున్న రాజకీయ పదవులను వదులుకోవాలంటే చంద్రశేఖర్ రావు సామిజిక వర్గంతో యుద్దం చేసినంత పనిచేయాలని రేవంత్ అభిప్రాయపడ్డారు.

  Jitender Reddy Key Suggestions To Bandi Sanjay | BJP Telangana | Oneindia Telugu
  కేసీఆర్ కు సమఉజ్జి నేనే.. సమర్ధవంతంగా ఎదుర్కొంటానన్న రేవంత్

  కేసీఆర్ కు సమఉజ్జి నేనే.. సమర్ధవంతంగా ఎదుర్కొంటానన్న రేవంత్

  చంద్రశేఖర్ రావు లాంటి రాజకీయ దురందరుడిని ఢీకొట్టాలంటే తనవద్ద వినూత్న అస్త్రాలున్నాయని, చంద్రశేఖర్ రావు కు తానైతేనే సరైన సమాధానం చెప్పగలనని, పదవినుంచి తొలగించాలన్నా, పోరాటం చేయాలన్నా, చంద్రశేఖర్ రావుకు సమఉజ్జీ తానేనని పరోక్షంగా రేవంత్ వివరించారు. అందుకే రాబోవు సార్వత్రిక ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగడంతో పాటు యుద్దవాతావరణం చోటుచేసుకుంటుందని పేర్కొన్నారు. చంద్రశేఖర్ రావు క్రూరత్వంతో కూడిన క్రిమినల్ ఆలోచనలకు సరైన సమాధానం చెప్పే సత్తా, సామర్థ్యం, సాహసం తన వద్దే ఉన్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.

  English summary
  TPCC president Revanth Reddy made the sensational revelation at a press conference held at the CLP office on Tuesday. Revanth Reddy made key remarks about the forthcoming general election, the by-elections that have passed and the thinking of CM Chandrasekhar Rao.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X