India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ది టైమ్ పాస్ పాలన.!మోదీ వస్తుంటే గులాబీ నేతల గుండెల్లో దడ మొదలైందన్న బండి సంజయ్.!

|
Google Oneindia TeluguNews

వరంగల్/హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా బీజేపీ జాతీయ నాయకత్వమంతా హైదరాబాద్ కు వస్తుందని తెలిసి సీఎం చంద్రవేఖర్ రావుకు ఆయన కుమారుడు తారక రామారావుకు గుండెల్లో వణుకు మొదలైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. అందుకే తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ బదనాం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఎందుకు హైదరాబాద్ వస్తున్నారో ప్రజలకు తెలుసని, చంద్రశేఖర్ రావుకు ఇంకా బాగా తెలుసని బండి సంజయ్ కుమార్ చమత్కరించారు.

 మోదీ,అమీత్ షా ఎందుకు తెలంగాణకు వస్తున్నారో కేసీఆర్ కు తెలుసు.. చమత్కరించిన బండి సంజయ్

మోదీ,అమీత్ షా ఎందుకు తెలంగాణకు వస్తున్నారో కేసీఆర్ కు తెలుసు.. చమత్కరించిన బండి సంజయ్


రాష్ట్రంలో టైం పాస్ పాలన కొనసాగుతోందని, కబ్జాలు, హత్యలు అత్యాచారాలకు తెలంగాణను అడ్డాగా మార్చిన చంద్రశేఖర్ రావు ఏ ముఖం పెట్టుకుని దేశమంతా తిరుగుతున్నారని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్, టీఆర్ఎస్ నాయకులు గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఏ ఆశయం, ఆకాంక్షల కోసం తెలంగాణ కోసం పోరాడారో, ఆ ఆకాంక్షలకు, అమరవీరుల ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. ఒక కుటంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని, ఉద్యమ ద్రోహులు రాజ్యమేలుతున్నారని, హత్యలు, అత్యాచారాలు, కబ్జాలకు అడ్డగా తెలంగాణను మార్చారు. సీసాలు అమ్ముకుని బతకాలనే స్థాయికి వచ్చారని ధ్వజమెత్తారు.

 రాష్ట్రంలో టైం పాస్ పాలన.. తెలంగాణ వాదులు బీజేపి చేరాలని బండి సంజయ్ పిలుపు

రాష్ట్రంలో టైం పాస్ పాలన.. తెలంగాణ వాదులు బీజేపి చేరాలని బండి సంజయ్ పిలుపు


అంతే కాకుండా చంద్రవేఖర్ రావు పాలనతో విసిగిపోయిన తెలంగాణ ఉద్యమ కారులంతా ఆ బతుకు తమకొద్దంటూ టీఆర్ఎస్ ను వీడుతున్నారన్నారు బండి సంజయ్. కుటుంబ-అవినీతి-నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీలో చేరుతున్నారు. ప్రజాదరణ ఉన్న నేతలెవరూ టీఆర్ఎస్ లో ఉండటం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ వాదులారా.. బీజేపీలో చేరండి. అందరం కలిసి అరాచక పాలన కొనసాగిస్తున్న సీఎం చంద్రశేఖర్ రావు మెడలు వంచుదాం. టీఆర్ఎస్ పాలనను బొందపెడదాం. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేద్దామని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

 కేంద్రం అన్ని అంశాల్లో సహకరిస్తోంది.. కేసీఆర్ వి పచ్చి అబద్దాలన్న బీజేపి ఛీఫ్

కేంద్రం అన్ని అంశాల్లో సహకరిస్తోంది.. కేసీఆర్ వి పచ్చి అబద్దాలన్న బీజేపి ఛీఫ్


తెలంగాణ అభివ్రుద్ధికి నిధులిస్తూ కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నా, చంద్రశేఖర్ రావు మాత్రం కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకుని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారని సంజయ్ మండిపడ్డారు. చంద్రశేఖర్ రావుకు తెలంగాణ అభివ్రుద్ధి పట్ల, ప్రజలపట్ల ధ్యాస లేదని, తన కుటుంబంలో ఎవరిని తదుపరి సీఎం చేయాలా? అని ఆలోచిస్తూ టైం పాస్ పాలన కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మడం లేదని, బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు అమలు కావాలన్నా, నిజాయితీగా లబ్ది దారులకు సంక్షేమ ఫలాలు అందాలన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని బండి సంజయ్ ఉద్ఘాటించారు.

 టీఆర్ఎస్ పాలనను బొంద పెట్టాలి.. చేతులు కలపాలన్న బండి

టీఆర్ఎస్ పాలనను బొంద పెట్టాలి.. చేతులు కలపాలన్న బండి


తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని ప్రధాని వస్తున్నారంటూ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా మహామహులంతా హైదరాబాద్ వస్తున్నారని, బహిరంగ సభ జరగబోతుందని తెలిసి చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో డప్పులు మొదలైయ్యాయన్నారు. అందుకే కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణకు ఎందుకు వస్తున్నారో జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా మోదీ చెప్పబోతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

English summary
BJP state president and MP Bandi Sanjay Kumar has said that CM Chandravekhar Rao and his son Taraka Rama Rao were shaken by the news that the entire BJP national leadership, including Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah and BJP national president JP Nadda, would be coming to Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X