హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫామ్‌హౌస్‌కు కేసీఆర్.. దేశపర్యటనకు విరామం; మళ్ళీ దసరా తర్వాత కేసీఆర్ జాతీయ మిషన్?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి దేశవ్యాప్త పర్యటనను ప్రారంభించిన విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తామంటూ పేర్కొన్న సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనకు చేసుకున్న షెడ్యూల్ ను పూర్తి చేయకముందే మరోమారు బ్రేక్ ఇచ్చారు. ఊహకు కూడా అందకుండా కెసీఆర్ వేస్తున్న అడుగులు, అనుసరిస్తున్న మౌనం, ఆకస్మిక పర్యటనలపై తెలంగాణాలో చర్చ జరుగుతుంది.

జాతీయ మిషన్ కు బ్రేక్ .. మళ్ళీ ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయిన కేసీఆర్

జాతీయ మిషన్ కు బ్రేక్ .. మళ్ళీ ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కెసిఆర్ ఎనిమిది రాష్ట్రాలలో పర్యటించవలసి ఉన్నా, మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్, బీహార్ లలో పర్యటించకుండానే దేశ పర్యటనకు బ్రేక్ ఇచ్చారు. చాలాకాలంపాటు ఫామ్ హౌస్ కు పరిమితం అయిన కేసీఆర్ ఫాం హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత దేశ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్త పర్యటనను ప్రకటించారు. ఇక కెసిఆర్ జాతీయ రాజకీయాలకు రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు అని అందరూ భావించే లోపే ఊహించని విధంగా దేశ పర్యటనకు బ్రేక్ ఇచ్చిన కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు .

కేసీఆర్ జాతీయ రాజకీయాలు... పర్యటనల రద్దుపై చర్చ

కేసీఆర్ జాతీయ రాజకీయాలు... పర్యటనల రద్దుపై చర్చ

ఫాం హౌస్ నుండి బయటకు వచ్చిన ఎనిమిది రోజుల వ్యవధిలోనే కేసీఆర్ మళ్లీ ఎర్రవెల్లి ఫాం హౌస్ వెళ్లిపోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ మళ్లీ ప్రగతి భవన్ కు ఎప్పుడు వస్తాడు? జాతీయ రాజకీయాలపై కెసిఆర్ దేశ పర్యటన ప్లాన్ మళ్లీ ఎప్పుడు పునః ప్రారంభం అవుతుంది అన్న అంశాలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కెసిఆర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయాన్నే మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధికి కెసిఆర్ వెళ్లాల్సి ఉంది. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ను కలవాల్సి ఉంది. ఇక ఆపై శిరిడీ సాయినాధుని దర్శించుకునే ప్లాన్ వుండగా, కెసిఆర్ ఆ ప్లాన్ ను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తుంది.

దేశ పర్యటన షెడ్యూల్ లో అడుగడుగునా బ్రేకులు..దేనికి?

దేశ పర్యటన షెడ్యూల్ లో అడుగడుగునా బ్రేకులు..దేనికి?


మళ్లీ కేసీఆర్ వచ్చే నెల 2వ తేదీన లేదా మూడవ తేదీన రాలేగావ్ సిద్ధికి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు గా సమాచారం. ఇక దేశ పర్యటన చేస్తానన్న కెసిఆర్ ఈనెల 20వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మళ్లీ 22వ తేదీన తెలంగాణ కు తిరిగి వచ్చారు. 23 న ప్రగతి భవన్ లో ఉండి 24న మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లారు. 25వ తేదీన ప్రగతి భవన్ కు వెళ్లి మళ్లీ 26 న బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఇక ఆపై శుక్రవారం మళ్ళీ ఫాం హౌస్ కు చేరుకున్నారు కెసిఆర్. షెడ్యూల్ ప్రకారం పర్యటనలు చెయ్యకుండా కెసీఆర్ ఎందుకు బ్రేక్ లు ఇస్తున్నారన్నది ఆసక్తిగా మారింది.

దసరా తర్వాత కెసీఆర్ జాతీయ రాజకీయాలా? అందరిలో ఆసక్తి

దసరా తర్వాత కెసీఆర్ జాతీయ రాజకీయాలా? అందరిలో ఆసక్తి


ఇక దేశ రాజకీయాల్లో అతి త్వరలోనే సంచలనం చూస్తారని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి మల్లారెడ్డి దసరా తర్వాత కెసిఆర్ రాజకీయం మామూలుగా ఉండదు అంటూ దేశ ప్రధాని అవుతారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ దసరా తర్వాత జాతీయ రాజకీయాలపై మళ్లీ పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తారా? అసలు కెసిఆర్ ఏం చేయబోతున్నారు అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

English summary
After giving a break for the country tour, the CM reached KCR Erravelli Farm House again. It is learned that he will enter the field again after Dussehra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X