హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త సచివాలయాన్ని 17న ప్రారంభించనున్న కేసీఆర్: ఇద్దరు సీఎంలు, అంబేద్కర్ మనవడు

ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సందర్శన యాగం నిర్వహించనున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సందర్శన యాగం నిర్వహించనున్నారు.

తెలంగాణ కొత్త సచివాయల ప్రారంభోత్సవానికి సీఎంలు, ప్రముఖులు

తెలంగాణ కొత్త సచివాయల ప్రారంభోత్సవానికి సీఎంలు, ప్రముఖులు


కాగా, తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రులు, జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రామానికి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హాజరుకానున్నారు. వీరితోపాటు అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు.

17న కేసీఆర్ చేతులమీదుగా కొత్త సచివాలయం ప్రారంభం, భారీ సభ

17న కేసీఆర్ చేతులమీదుగా కొత్త సచివాలయం ప్రారంభం, భారీ సభ

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఫిబ్రవరి 17న 11.30 నుంచి 12.30 గంటల మధ్య జరగనుంది. ప్రారంభోత్సవానికి ముందు ఆరోజు ఉదయం వేదపండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సచివాలయం ప్రారంభోత్సవ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సచివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పైన పేర్కొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారు.

ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న తెలంగాణ కొత్త సచివాలయం

ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న తెలంగాణ కొత్త సచివాలయం

రూ.617 కోట్లతో సచివాలయ భవనాన్ని గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో నిర్మించారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్‌ చేశారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ పేరుని ఖరారు చేశారు. సచివాలయం లోపలే టెంపుల్‌, మజీద్‌ కూడా నిర్మిస్తున్నారు.భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా దాదాపు 100 ఏళ్లు మనగలిగేలా ఈ సెక్రటేరియన్ భవనాన్ని నిర్మించారు. తెలంగాణ సెక్రటేరియట్ మొత్తం విస్తీర్ణం 28 ఎకరాలు. ఇందులో 10,51,676 చదరపు అడుగుల్లో 11 అంతస్తుల ఎత్తులో భవనాన్ని నిర్మించారు. అయితే, ఇందులో ఉన్నవి ఆరు అంతస్తులు మాత్రమే. డెక్కన్, కాకతీయ శైలిలో నిర్మించిన ఈ భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ఉన్నాయి. తెలంగాణ సంప్రదాయంతోపాటు ఆధునిక హంగులతో దీన్ని నిర్మించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి జూన్ 27, 2019లో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వేగంగా భవన నిర్మాణ పనులు పూర్తి చేయడంతో ఫిబ్రవరి 17న కేసీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించినున్నారు.

English summary
KCR to inaugurate Telangana Secretariat on Feb 17th: CMs Stalin, Hemant soren and prakash ambedkar will attend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X