వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిమ్మ తిరగాల్సిందే: కెసిఆర్ వేతనం ఎంతో తెలుసా, మరి చంద్రబాబుది...

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వేతనం ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. చంద్రబాబు కన్నా ఆయన చాలా ఎక్కువ వేతనం తీసుకుంటున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు వేతనం ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. చాలా మంది ముఖ్యమంత్రుల కన్నా ఆయన ఎక్కువ వేతనం తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వేతనం దాదాపుగా అందులో సగం ఉంటుంది.

ధనిక రాష్ట్రం కాబట్టి కెసిఆర్ అంత వేతనం తీసుకోవడంలో తప్పు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు సమర్థించుకుంటున్నారు. కెసిఆర్ నెల జీతం అక్షరాలా 4 లక్షల 21 వేల రూపాయలు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులకు కూడా వేతనాలు దండిగానే ఉన్నాయి. వారికి నెలకు 2 లక్షల 50 వేల చొప్పున వేతనం ముడుతోంది. దేశంలోనే ఏ రాష్ట్ర శాసనసభ్యులకు కూడా అంత వేతనం లేదు. ఎక్కువ జీతం ఇస్తే అవినీతి అంతగా తగ్గుతుందనేది కూడా కెసిఆర్ ఆలోచనల్లో ఒక్కటి కావచ్చు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నెల జీతం కూడా తక్కువేమీ కాదు. దేశంలో అత్యధిక వేతనం పొందుతున్న ముఖ్యమంత్రుల్లో ఆయన మూడో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో కెసిఆర్ ఉండగా, రెండో స్థానంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 2 లక్షల 50 వేల రూపాయలు. మూడో స్థానంలో ఉన్న చంద్రబాబు 2 లక్షల 40 వేల రూపాయలు నెలకు జీతంగా తీసుకుంటున్నారు.

KCR top in salry drawing among the CMs

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత కేవలం ఒక్క రూపాయి వేతనం మాత్రమే తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు వేతనమే తీసుకోవడం లేదని అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలు కూడా తక్కువే.

కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నెలసరి వేతనాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

1. తెలంగాణ ముఖ్యమంత్రి రూ.4,21,000, ఎమ్మెల్యేలు రూ.2,50,000
2. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రూ. 2,50,000, ఎమ్మెల్యేలు రూ.1,60,000
3. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రూ.2,40,000, ఎమ్మెల్యేలు రూ.1,25,000
4. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రూ.2,00,000, ఎమ్మెల్యేలు రూ.1,10,000
5. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రూ.2,25,000
6 ఢిల్లీ ముఖ్యమంత్రి రుూ.1,20,000
7. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సున్నా, ఎమ్మెల్యేలు 42,000

English summary
Telangana CM K Chandrasekkhar Rao is drawing highest salary among the CMs. Andhra Pradesh CM Nara Chandrababu Naidu is in third place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X