ప్రచారం కోసమే కేసీఆర్ టూర్లు.!దొంగ సొమ్ము దాచుకునేందుకు కేటీఆర్ విదేశీ పర్యటన.!బండి సంజయ్ ఫైర్.!
హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పైన, ఆయన కుమారుడు కేటీఆర్ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకరు దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు విదేశాలకు వెళ్తే మరోకరు ప్రచారం కోసమే దేశంలో పర్యటిస్తున్నారని మండిపడ్డారు.హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 25న కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి హిందూ ఏక్తా యాత్ర చేపడుతున్నట్లు బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని హిందూ సమాజ ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహించే ఈ యాత్రకు వేలాదిగా హిందూ బంధువులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణను దివాళా తీయించిన టీఆర్ఎస్..సక్రమంగా జీతాలిచ్చే పరిస్థితి లేదన్న బీజేపి ఛీఫ్
రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి చంద్రశేఖర్ రావు కొడుకు విదేశాలకు వెళుతుంటే చంద్రశేఖర్ రావు మాత్రం సంచలనం స్రుష్టిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతూ ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని, పత్రికల్లో, టీవీల్లో హెడ్ లైన్ల కోసమే కేసీఆర్ సంచలనం చేస్తానంటున్నారే తప్ప ఆయన చేసేదేమీ లేదన్నారు. చంద్రశేఖర్ రావు ను ఇతర రాష్ట్రాల నేతలు జోకర్ లాగా చూస్తున్నారని, టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాళా తీసిందని, ప్రజల చేతికి చిప్ప ఇచ్చారని, ఉద్యోగులకు సక్రమంగా జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదన్నారు బండి సంజయ్. పేదలకు పెన్షన్లు కూడా సరిగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

సీఎం పేరిట ఇచ్చిన చెక్కులు బౌన్స్.. ప్రభుత్వానికి సిగ్గుండాలన్న బండి సంజయ్
అంతే కాకుండా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గత 12 సంవత్సరాలుగా ప్రతి ఏటా కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామని, కోవిడ్ కారణంగా గత రెండేళ్లపాటు ఈ యాత్రను నిర్వహించలేకపోయామని, ఈసారి భారీ ఎత్తున కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామన్నారు బండి సంజయ్. వేలాది మంది హిందూ బంధువులంతా ఈ యాత్రకు తరలివచ్చి తెలంగాణలోని హిందూ సమాజ సంఘటిత శక్తిని, ఐక్యతా స్పూర్తిని మరోసారి చాటి చెప్పాలన్నారు బండి సంజయ్. ఒక నెల పెన్షన్ సొమ్మును ఎగ్గొట్టారరని, గతంలో సీఎం పేరిట ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడం దౌర్బాగ్యమన్నారు బండి సంజయ్.

పెద్ద సంఖ్యలో హిందూ ఏక్తా యాత్ర.. హిందువులందరూ కదలి రావాలన్న బండి సంజయ్
గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో హిందూ ఏక్తా యాత్రకు తరలివచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే సింగపూర్, దుబాయి సహా విదేశాల నుండి పెద్ద ఎత్తున యువత ఈ యాత్రలో పాల్గొనేందుకు వస్తున్నారన్నారు బండి సంజయ్. ఈసారి హిందూ ఏక్తా యాత్రకు శ్రీనివాసానంద స్వామి అతిథిగా హాజరై భక్తులకు మార్గదర్శనం చేయబోతున్నారన్నారు. యాత్రలో భాగంగా భక్త హనుమాన్, శ్రీరామ చంద్ర స్వామి విగ్రహాలను తయారు చేశామని, ఈసారి పెద్ద ఎత్తున హనుమాన్ వేషధారులు ఈ యాత్రలో పాల్గొంటారన్నారు. ఈనెల 25న సాయంత్రం 4.30 గంటలకు కరీంనగర్ వైశ్యా భవన్ నుండి ప్రారంభం కానున్నా హిందూ ఏక్తా యాత్రను జయప్రదం చేయాలనన్నారు బండి సంజయ్.

ప్రధానికి మోహం చూపించే దమ్ము లేదు.. అందుకే సీఎం ఇతర రాష్ట్రాలకు టూర్లకు వెళ్తున్నారన్న బండి
రాష్ట్రంలో ఎంతో మంది రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చంద్రశేఖర్ రావు మూర్ఖత్వ పాలన వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు బండి సంజయ్. అయినప్పటికీ ఏనాడూ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించకుండా ఏ ఒక్క కుటుంబానికి నయా పైసా సాయం చేయని చంద్రవేఖర్ రావు పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు సాయం చేస్తానని చెప్పడం సిగ్గు చేటన్నారు బండి సంజయ్. ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్నారంటేనే సీఎం వెన్నులో వణుకుపుడుతోందని,అందుకే ఆయనకు ముఖం చూపించే దమ్ము లేక పర్యటన పేరుతో ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు చంద్రశేఖర్ రావుపై బండి సంజయ్ ధ్వజమెత్తారు.