• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ కాదు బుట్టలో పడటానికి అక్కడ స్టాలిన్ ... కేసీఆర్ ను ఎద్దేవా చేసిన విజయశాంతి

|
  కేసీఆర్ కు గట్టిఎదురుదెబ్బన్నవిజయశాంతి || Oneindia Telugu

  తెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడుతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ డ్రామాకి తెరపడిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని దేశం మొత్తం తిరుగుతూ రాజకీయాలు చేస్తున్న కెసిఆర్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళ నేతలే అంటున్నారని విజయశాంతి అన్నారు.

  మే 23న సోనియా ఎన్డీయేతర పక్షాల భేటీకి ఆహ్వానం ..ఫలితాల రోజు భేటీ సక్సెస్ అయ్యేనా ?మే 23న సోనియా ఎన్డీయేతర పక్షాల భేటీకి ఆహ్వానం ..ఫలితాల రోజు భేటీ సక్సెస్ అయ్యేనా ?

  తమిళనాట కేసీఆర్ పప్పులు ఉడకలేదన్న విజయశాంతి

  తమిళనాట కేసీఆర్ పప్పులు ఉడకలేదన్న విజయశాంతి

  ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కోసం ఇటీవల కెసిఆర్, డీఎంకే నేత నేత స్టాలిన్ తో చర్చలు జరిపారు . అయితే స్టాలిన్ చెప్పినటువంటి మాటలకు కెసిఆర్ ఒక్కసారిగా షాక్ తిన్నారని , కుచించుకుపోయారని, విజయశాంతి అన్నారు. తమిళనాట కేసీఆర్ పప్పులు ఉడకలేదని అన్నారు . అంతేకాకుండా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని కలలు కన్నటువంటి కెసిఆర్ కి నిరాశే మిగిలిందని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఈమేరకు విజయశాంతి తన ఫేస్‌బుక్ పేజ్ లో సుదీర్ఘమైన ఈ పోస్ట్‌ను షేర్ చేశారు.

  ఫేస్ బుక్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిన విజయశాంతి

  ఫేస్ బుక్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిన విజయశాంతి

  "ఇన్ని రోజులు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వేసుకున్న ముసుగు తొలగిపోవడంతో..సారు, కారు, సర్కారు అంటూ మాట్లాడిన వారి నోట.. డామిట్ కథ అడ్డం తిరిగింది" అనే డైలాగ్ వినిపిస్తోందన్నారామె. ‘‘వైసీపీ అధినేత జగన్‌ను బుట్టలో వేసుకున్న విధంగానే, స్టాలిన్‌ను కూడా బురిడీ కొట్టించాలని కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రదర్శించారు. కానీ ఆ పప్పులు తమిళనాట ఉడకలేదు. ఎందుకంటే తన తండ్రి కరుణానిధి నాయకత్వంలో కేసీఆర్ లాంటి ఎంతో మంది మాయగాళ్లను చూసిన అనుభవం స్టాలిన్‌కు ఉంది. అందుకే ఈ గిమ్మిక్కులను తిప్పికొట్టి, స్టాలిన్ తన చాణక్యనీతిని ప్రదర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేలోనే డీఎంకే కొనసాగుతుందని చెప్పి, టీఆర్ఎస్ ఛీప్ ట్రిక్స్‌కు చెక్ పెట్టారు'' అని విజయశాంతి విమర్శించారు.

   జగన్ కాదు బుట్టలో వేసుకోటానికి అక్కడ స్టాలిన్ అన్న విజయశాంతి

  జగన్ కాదు బుట్టలో వేసుకోటానికి అక్కడ స్టాలిన్ అన్న విజయశాంతి

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ ను బుట్టలో వేసుకున్నట్టుగానే, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను బురిడీ కొట్టించాలని చూసిన కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెస్ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు స్టాలిన్ కొట్టిన దెబ్బతో దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందని ఆమె అన్నారు. స్టాలిన్ ను బురిడీ కొట్టించబోయి దెబ్బ తిన్నాడని ఆమె ఎద్దేవా చేశారు.

  English summary
  Congress leader and former MP Vijayashanti has said Telangana Chief Minister K. Chandrashekar Rao tried to hoodwink DMK chief M.K. Stalin just like he did YSRCP president Y.S. Jaganmohan Reddy, but failed miserably.In a statement here, she said the response from Mr. Stalin gave a clear indication that no one would take Mr. Chandrasekhar Rao seriously and by rejecting his Federal Front idea the dreams of KCR have been shattered now. She said KCR took the credit for Telangana though the Congress delivered its promise but his similar moves to deceive other parties for his self promotion will not work. .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X