హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోల్కొండలో జెండా ఎగురవేసిన కేసీఆర్: మోడీ మెచ్చుకున్నారంటూ ప్రసంగం

|
Google Oneindia TeluguNews

Recommended Video

    గోల్కొండలో జెండా ఆవిష్కరించిన కేసీఆర్

    హైదరాబాద్: 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవవందనాన్ని సీఎం స్వీకరించారు.

    అంతకుముందు పరేడ్ మైదానంలో సైనికుల స్మారకం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ్నుంచి నేరుగా కేసీఆర్ గోల్కొండ కోటకు బయల్దేరారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

    KCR unfurls tricolor at Golconda Fort on Independence Day

    Newest First Oldest First
    12:25 PM, 15 Aug

    ‘అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుస్దాధ్యం చేసేవరకు విశ్రమించలేదు. నేడు అదే సంకల్పబలంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకిత మవుతున్నాను. ఈ ప్రయాణంలో ప్రజలే నాకు అండదండ. వారి దీవెనలే ప్రేరణ. తెలంగాణ విజయయాత్ర ఇదే విధంగా కొనసాగేందుకు తగిన బలాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అందించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’ అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
    12:24 PM, 15 Aug

    ‘హైదరాబాద్ నగర వాసులు ఎంతగానో ఎదురుచూసిన మెట్రో మొదటి దశ ప్రారంభమైంది. రోజుకు లక్షమందికి పైగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం ఆనందాన్ని కల్గిస్తోంది. మిగిలిన దశల పనులు కూడా సత్వరం పూర్తిచేసి ప్రారంభించడానికి కృషిచేస్తున్నాం’ అని సీఎం తెలిపారు.
    12:24 PM, 15 Aug

    ‘హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నందున ఔటర్ రింగు రోడ్డుకు అవతల 330 కిలోమీటర్ల రీజనల్ రింగు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీజనల్ రింగు రోడ్డు సంగారెడ్డి-గజ్వేల్-చౌటుప్పల్-మాల్-కడ్తాల్-షాద్ నగర్- చేవెళ్ల-కంది పట్టణాల మీదుగా వలయాకారంలో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి ఎక్స్ ప్రెస్ హైవేగా రీజనల్ రింగురోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని కేసీఆర్ తెలిపారు.
    12:22 PM, 15 Aug

    ‘విశ్వనగరంగా హైదరాబాద్ నగరాన్నితీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నది’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
    12:22 PM, 15 Aug

    ‘నిరుపేదలకు గృహనిర్మాణం పథకం అమలుచేయడంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్ రూం ఇళ్ళను నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రథమం’ అని కేసీఆర్ చెప్పారు.
    12:21 PM, 15 Aug

    ‘ఎన్నో దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన టి-హబ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐ.టి ఎగుమతులు ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఐ.టి. పరిశ్రమను రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతోంది’ అని సీఎం వివరించారు.
    12:21 PM, 15 Aug

    ‘తెలంగాణ రాష్ట్రం ఐ.టి రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో హైదరాబాద్ ప్రముఖ ఐ.టి హబ్ గా గుర్తింపు పొందింది. రాష్ట్రప్రభుత్వం రూపొందించిన నూతన ఐ.టి విధానంతోపాటు, సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఐ.టి రంగంలో గణనీయమైన పెట్టుబడులు రావడం ప్రారంభమైంది’ అని కేసీఆర్ చెప్పారు.
    12:19 PM, 15 Aug

    తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. వారి కోసం ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
    12:18 PM, 15 Aug

    ‘బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదల కోసం ప్రత్యేక పథకాలను రూపకల్పన చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని తెలియజేస్తున్నాను’ అని సీఎం తెలిపారు.
    12:18 PM, 15 Aug

    ‘వెనుకబడిన కులాల వారికి ఈ రోజు ఒక శుభవార్తను తెలిపేందుకు సంతోషిస్తున్నాను. బిసి కులాల వారు వారికి నచ్చిన పని చేసుకోవడానికి వీలుగా, తగిన ఆర్ధిక సహకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బ్యాంకులతో నిమిత్తం లేకుండా, లబ్దిదారులు ఒక్క రూపాయి వాటాధనం చెల్లించ వలసిన అవసరం లేకుండా, వందకు వంద శాతం ఉచితంగా బిసిల కులాల వారందరికీ స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ధన సహాయం చేస్తుంది. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించమని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం’ అని కేసీఆర్ చెప్పారు.
    12:16 PM, 15 Aug

    తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని సీఎం తెలిపారు.
    11:15 AM, 15 Aug

    ఈ నాలుగు సంవత్సరాల విలువైన సమయాన్ని తెలంగాణ భవిష్యత్‌కు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నామని కేసీఆర్ తెలిపారు.
    11:14 AM, 15 Aug

    ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రస్థానం సాగుతున్నదని సీఎం చెప్పారు.
    11:14 AM, 15 Aug

    తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటున్నదని సీఎం స్పష్టం చేశారు.
    11:14 AM, 15 Aug

    రూ. 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని కేసీఆర్ తెలిపారు.
    11:14 AM, 15 Aug

    సమైక్య రాష్ట్రంలో ఎగబెట్టిన ఇన్‌పుట్ సబ్సిడీలను తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చెల్లించిందని గుర్తు చేశారు.
    11:14 AM, 15 Aug

    గ్రామాల్లో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులకు సబ్సిడీపై వరినాటు యంత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించామని కేసీఆర్ చెప్పారు.
    11:14 AM, 15 Aug

    ఈ ఏడాది మండలానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,500 వరినాటు యంత్రాలు పంపిణీ చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
    11:14 AM, 15 Aug

    భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూరికార్డుల ప్రక్షాళనను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశామన్నారు. దీంతో 94 శాతం భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చిందని కేసీఆర్ చెప్పారు.
    11:13 AM, 15 Aug

    పంట పెట్టుబడి పథకం కింద రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ. 8 వేలు ఇస్తున్నామని సీఎం తెలిపారు.
    11:13 AM, 15 Aug

    భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత కోసం ధరణి వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసిందని సీఎం చెప్పారు.
    11:12 AM, 15 Aug

    భూముల రిజిస్ట్రేషన్లలో ఇకపై వందకు వంద శాతం పారదర్శకత సాధించేందుకు సమూల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.
    10:42 AM, 15 Aug

    దేశంలో రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం కేసీఆర్ చెప్పారు.
    10:41 AM, 15 Aug

    కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు.
    10:41 AM, 15 Aug

    నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నామని, పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
    10:40 AM, 15 Aug

    తెలంగాణ ప్రభుత్వం పరిణతితో వ్యవహరిస్తోందని ప్రధాని మోడీ చెప్పారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారని చెప్పారు.
    10:40 AM, 15 Aug

    ఆవిర్భవించిన అనతికాలంలోనే దేశం గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని కేసీఆర్ అన్నారు.
    10:40 AM, 15 Aug

    సంక్షేమ పథకాలతో అణగారిన వర్గాలకు అండదండలు అందిస్తున్నామని సీఎం చెప్పారు.
    10:40 AM, 15 Aug

    సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్నీ నేడు పునరుత్తేజం పొందాయని కేసీఆర్ అన్నారు.
    10:35 AM, 15 Aug

    తెలంగాణ ఏర్పడితే చిమ్మ చీకట్లే అన్నవారి అంచనాలను తలకిందులు చేశామని కేసీఆర్ అన్నారు.
    READ MORE

    English summary
    Telangana CM KCR unfurled the tricolor at the historic Golconda Fort on the occasion of 72nd Independence Day celebrations. Addressing on the occasion, CM KCR hailed the soldiers and the leaders who sacrificed their lives for the country.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X