• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ట్యాంక్‌బండ్‌పై బాపూజీ విగ్రహం: కేసీఆర్

By Nageswara Rao
|

హైదరాబాద్: ‘తెలంగాణ కోసం ప్రాణమున్నంతకాలం తపించి పోరాడిన మహనీయుడు.. తొలి పదవీ త్యాగం ఆయనదే. 1969లోనే మంత్రి పదవిని తృణవూపాయమనుకున్నడు. ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ జగమెరిగిన మహానేత' అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు.

తెలంగాణలో యూనివర్సిటీకో, లేదంటే ఏదైనా గొప్ప సంస్థకో ఆ మహానుభావుడి పేరు పెట్టి భావితరాలకు గుర్తుండిపోయేటట్లు చేస్తం అని సీఎం ప్రకటించారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ 99వ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పద్మశాలి భవన్ ముందు ఆయన నిలు విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అక్కడున్న అవసరం లేని వ్యక్తుల విగ్రహాలను తీసేస్తామన్నారు. వాటిని లారీల్లో తెలంగాణ ప్రభుత్వమే ఆంధ్రాకు తరలిస్తుందన్నారు.

దానికి టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కూడా కలిసి రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల ఆకలిచావులు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. అందుకే త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఆ తర్వాత కార్యాచరణను కొండా లక్ష్మణ్‌బాపూజీ మిషన్‌గా నామకరణం చేసి అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది బాపూజీ శతజయంతివేడుకల సందర్భంగా ప్రతి నెలా కార్యక్షికమాలు ఉండేటట్లుగా అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

KCR unveils Konda Lakshman Bapuji’s statue at Padmashali Bhavan

‘అందరూ ఉద్యమం 2001లో పుట్టిందంటారు.. కానీ 2000లోనే తెలంగాణ ఐక్యవేదిక పేరిట ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీల సారథ్యంలో జలదృశ్యంలోనే పని మొదలుపెట్టారు' అని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఏడాది పాటు 3, 4 వేల గంటల చర్చలు జరిగాయి. అప్పుడే టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావానికి పునాదులు పడ్డాయి అని వివరించారు.

ఇదంతా కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశీస్సులతోనే జరిగిందన్నారు. ‘కర్కోటకుడైన ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే పార్టీని ఏర్పాటు చేశాం. అప్పట్లో ఆంధ్రా పత్రికలు, ఆంధ్రా మీడియా ముందుకు పడనియ్యలేదు. మా పార్టీకి కిరాయికి ఇల్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సీఎం కార్యాలయం నుంచే బెదిరింపులు వచ్చేవి ' అని చెప్పారు.

చంద్రబాబునాయుడు జలదృశ్యంపై దాడి చేయించాడు.. మా పార్టీకి సంబంధించిన ఫర్నీచర్‌ను, కంప్యూటర్లను బయట పడేయించిండు. ఇప్పుడు జలదృశ్యంపై సమీక్ష జరుపుతం.. బాపూజీని చిరస్మరణీయుడిని చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతామని సీఎం హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మాట్లాడుతూ కేసీఆర్ రథసారథి, సాధకుడైతే, బాపూజీ స్వాప్నికుడని, సాధనలో భాగం అని కొనియాడారు.

English summary

 
 KCR, the Chief Minister of Telangana will be unveiling the statue of Konda Lakshman Bapuji, who is more aptly known as the Father of Telangana, at Padmashali Bhavani in Nararaynguda, on Saturday. Today is the 99th birth anniversary of Konda Lakshman Bapuji, who has sacrificed so much for the sake of statehood for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X