వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడు వింతల్లో ఒకటి: 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' వద్ద కెసిఆర్, బృందం

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం నాడు ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించారు. కెసిఆర్‌తో పాటు ఆయన బృందం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించింది.

తియాన్మెన్ స్కేర్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్

రాష్ట్ర సీఎం కెసిఆర్ చైనా పర్యటన ఆదివారం నాడు ఏడో రోజుకు చేరింది. పర్యటనలో భాగంగా బీజింగ్‌లో ఆయన పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. సీఎం నేడు తియాన్మెన్ స్కేర్‌ను సందర్శించారు. సాయంత్రం షెంజన్‌లో పర్యటించనున్నారు.

KCR visits Great Wall of China on Sunday

కాగా, చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం బీజింగ్‌లో చారిత్రాత్మక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా అక్కడ ఉన్న ఫర్ బిడెన్ సిటీని కేసీఆర్ బృందం సందర్శించింది. శనివారం తీరిక లేకుండా గడిపిన కేసీఆర్ అక్కడి పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

కేసీఆర్ బృందం కలిసిన కంపెనీ ప్రతినిధులలో చైనా ఫార్చూన్ ల్యాండ్ డెవలప్ మెంట్ కంపెనీ వారు కూడా ఉన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి ఫార్చూన్ ల్యాండ్ కంపెనీ ఆసక్తి కనబర్చింది.

విశ్వనగరానికి చైనా చేయూత

చైనాకు చెందిన నిర్మాణ రంగ అత్యాధునిక యంత్రాల తయారీ సంస్థ సనీ సహా పలు ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్ అభినృద్ధిలో భాగస్వాములయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

English summary
Telangana CM K Chandrasekhar Rao tours the Great Wall of China along with his cabinet colleagues in China on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X