వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి నియోజకవర్గంలో 60వేల పార్టీ సభ్యత్వాలు ... శ్రేణులను కోరిన కెసిఆర్ ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

పార్టీ సభ్యత్వ నమోదుపై తెలంగాణా సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ సారి ప్రతి నియోజక వర్గం లో కనీసం 60 వేల మెంబర్ షిప్ చెయ్యాలని ఆయన శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో బిజెపి, టిఆర్‌ఎస్‌ల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు మిస్డ్ కాల్ మెంబర్‌షిప్ డ్రైవ్‌ ప్రారంభించాయి , అంటే సభ్యుడి వివరాలు మరియు అతని ఆధార్ కార్డ్ మరియు అతని ఫోన్ నంబర్ పార్టీ కార్యాలయంలో ఉండేలా సభ్యత్వ నమోదు చెయ్యనున్నారు . చాలా రాజకీయ పార్టీలలో ఉన్నట్లుగా నకిలీ సభ్యత్వ ప్రచారాలకు చెక్ పెట్టె ఆలోచనలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్ఎస్ , బీజేపీలు పోటాపోటీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు

టీఆర్ఎస్ , బీజేపీలు పోటాపోటీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు

ఇక తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన అమిత్ షా స్వయంగా ఒక లంబాడి మహిళకు సభ్యత్వ కార్డు ఇవ్వడం ద్వారా సభ్యత్వాన్ని ప్రారంభించగా, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సభ్యత్వ నమోదుపై పై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ కార్యకర్తలు కనీసం 60000 మంది కొత్త సభ్యులను చేర్చుకోవాలని ఆయన కోరుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీ శ్రేణులకు ఇదే దిశా నిర్దేశం చేశారు.

క్షేత్ర స్థాయిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ .. నియోజకవర్గానికి 60 వేల సభ్యత్వాలు చెయ్యాలంటున్న టీఆర్ఎస్

క్షేత్ర స్థాయిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ .. నియోజకవర్గానికి 60 వేల సభ్యత్వాలు చెయ్యాలంటున్న టీఆర్ఎస్

ఇది నిజంగా జరిగితే, అప్పుడు టిఆర్ఎస్ రాష్ట్రంలో బలమైన పార్టీగా మారే అవకాశం వుంటుంది . ఇప్పటికే బలమైన కేడర్ ఉన్న టీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్ లో కూడా ఎదురులేని రాజకీయ పార్టీగా ఉండాలని సభ్యత్వ నమోదుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది . బిజెపి కూడా తన సభ్యత్వాన్ని కనీసం 12 శాతం పెంచాలని కోరుకుంటుంది. అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లలో ఎక్కువ మంది టిఆర్‌ఎస్ లేదా బిజెపిలో సభ్యులు కానున్నట్టు తెలుస్తుంది .

తెలంగాణా లో వచ్చే ఎన్నికల టార్గెట్ గా బీజేపీ .. బీజేపీ కి చెక్ పెట్టె వ్యూహంలో కేసీఆర్

తెలంగాణా లో వచ్చే ఎన్నికల టార్గెట్ గా బీజేపీ .. బీజేపీ కి చెక్ పెట్టె వ్యూహంలో కేసీఆర్

భవిష్యత్ లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పని చేస్తున్న బీజేపీ విషయంలో ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని నాయకులను కోరిన గులాబీ బాస్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టటంతో పాటు సభ్యత్వ నమోదు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది . ఇక కాంగ్రెస్ నుండి ఇప్పటికే చాలా మంది గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. అంతే కాదు అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా లేదు . ఇదే అదునుగా , 2023 ఎన్నికల టార్గెట్ గా బీజేపీ దూకుడు పెంచింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఊహించని విధంగా బీజేపీ పుంజుకోవటం టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకు చేస్తున్న ప్రయత్నం భవిష్యత్ లో ఈ రెండు పార్టీలు తలపడతాయా అన్న సంకేతాలిస్తుంది.

English summary
There seems to be a competition between the BJP and the TRS over party membership drive. Both the parties have taken to the missed call membership drive, which means the member is identifiable and his Aadhar Card and his phone number would be with the party office. There will be no fake membership campaigns as is the case in most political parties.While Amit Shah himself has launched the membership by going to the house of a Lambadi girl and giving her membership card, TRS working president KTR has held a tele conference with party workers across the state over the membership drive. He wants the party workers to enrol at least 60000 new members per each assembly constituency. If this really happens, then the TRS would be in an unassailable position. The BJP too wants to increase its membership by at least 12 per cent. This means most of the voters in the assembly constituencies will be members of either the TRS or the BJP.If this happens, there would be no members left for the Congress and the other parties. Is this a clear indication that the 2023 elections would be essentially a fight between the BJP and the TRS and that all parties would be swept away?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X