హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక్కడుంది కేసీఆర్, హైదరాబాద్‌లో ఉండి భూకంపం పుట్టిస్తా, ఇదీ మన దుస్థితి: ఇద్దరికీ కేసీఆర్ లెక్కలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ సమర శంఖం

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ఆయన లెక్కలతో సహా నిప్పులు చెరిగారు. తాను చేసిన థర్డ్ ఫ్రంట్ ప్రకటనతో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. నేను హైదరాబాద్ నుంచి భూకంపం పుట్టిస్తానని, హైదరాబాద్ కేంద్రంగానే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని, తెలంగాణ వదిలి వెళ్లనని చెప్పారు.

నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా, ముక్కు నేలకు రాయాలి: కేసీఆర్నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా, ముక్కు నేలకు రాయాలి: కేసీఆర్

గులాబీ పరిమణాలను దేశంలోని మారుమూల ప్రాంతాలకు వెదజల్లి, కాంగ్రెస్-బీజేపీ కబంధ హస్తాల నుంచి దూరం చేస్తానని చెప్పారు. మనకు అద్భుతమైన మౌలిక సదుపాయాలు, అద్భుత నీటి సామర్థ్యం ఉందని, వనరులు, వసతులు, డబ్బులు ఉన్నాయన్నారు. కష్టపడే ప్రజలు ఉన్నారని, కానీ పాలకులకే చిత్తశుద్ధి లేదన్నారు. వారికి దమ్ము లేదు, అవగాహన లేదన్నారు. సమస్యలపై అధ్యయనం చేయట్లేదన్నారు. వారి నిష్క్రియాపరత్వం దేశానికి నష్టమన్నారు.

జై తెలంగాణ, జై భారత్ నినాదం

జై తెలంగాణ, జై భారత్ నినాదం

మీరు (టీఆర్ఎస్) ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతానని, దేశ రాజకీయాల్లో ప్రభావ, క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ గడ్డ పేరును అందరి నోళ్లలో నాణేలా, అందరూ పొగిడేలా చేస్తానని కేసీఆర్ చెప్పారు. 70 ఏళ్లుగా అధికారంలో ఉండి కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రసంగం చివర్లో జై తెలంగాణ.. జై భారత్ అని కేసీఆర్ నినాదాలు చేశారు.

నేను మాట్లాడితే మీకు వణుకు ఎందుకు?

నేను మాట్లాడితే మీకు వణుకు ఎందుకు?

ఈ రోజు దేశంలో ఏం జరగాలో అది జరగడం లేదని కేసీఆర్ చెప్పారు. ఈ బక్క ప్రాణం తెలంగాణ నుంచి ఒక ప్రకటన చేస్తే.. తనది ప్రకటన కాదు.. ప్రకంపన అని కేసీఆర్ అన్నారు. నేను మాట్లాడితే రాహుల్ గాంధీ స్పందిస్తారని ఎద్దేవా చేశారు. దేశం గురించి మాట్లాడే హక్కును కాంగ్రెస్, బీజేపీలో తీసుకున్నాయా అని మండిపడ్డారు. నేను ఫ్రంట్ గురించి మాట్లాడితే.. కేసీఆర్ మోడీ ఏజెంట్ అని రాహుల్ అంటారని, బీజేపీ నేత ఫ్రంట్‌కు టెంట్ లేదని అంటారని, నేను మాట్లాడితే వారికి భయం ఎందుకని ప్రశ్నించారు. మీలో వణుకు ఎందుకో చెప్పాలన్నారు.

ఇక్కడ ఉన్నది కేసీఆర్ అందుకే భయం

ఇక్కడ ఉన్నది కేసీఆర్ అందుకే భయం

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వణుకుకు కారణం ఇక్కడ ఉన్నది కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. నేను మొండి కదా, ఎత్తిన జెండాను దించను కదా అందుకే వారికి భయం అన్నారు. ఈ దేశంలో పుట్టాం కాబట్టి మన దేశం బాగుపడాలన్నారు. ఆకాశం, భూమి ఒక్కటి చేసినా మనం తప్పకుండా ఈ దేశం బాగు కోసం పాటుపడాలన్నారు. తెలంగాణను ఎలా నిజం చేశానో, ఈ దేశానికి అలాగే దారి చూపిస్తానని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిడ్డగా తెలంగాణ గౌరవాన్ని పెంచుతానని చెప్పారు.

కఠోర సత్యాలు.. ఇదిగోండి ఉదాహరణలు

కఠోర సత్యాలు.. ఇదిగోండి ఉదాహరణలు

ఈ దేశానికి తెలంగాణ గడ్డ నుంచి మేలు జరగాలన్నదే తన ధ్యేయమని కేసీఆర్ అన్నారు. ఈ వేదిక పై నుంచి (ప్లీనరీ) కఠోర సత్యాలు చెబుతున్నానని కొన్ని ఉదాహరణలు చెప్పారు. మనం బీజేపీ కాదంటే కాంగ్రెస్, కాంగ్రెస్ కాదంటే బీజేపీకి ఓటు వేస్తున్నామని (కేంద్రంలో), ఇన్నాళ్లు వారి డ్రామాలు నడిచాయన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహరణలు చెప్పారు.

నాకు సమాధానం చెప్పండి

నాకు సమాధానం చెప్పండి

కావేరీ నీటి విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. భారత్‌లో నీటి యుద్ధాలు అంటుంటారని, మీ అసమర్థ పాలన వల్లే నీటి యుద్ధాలు అన్నారు. మీ దద్దమ్మ రాజకీయాల వల్లే దేశంలో నీటి యుద్ధాలు అన్నారు. ఈ దేశానికి ఇలాంటివి అవసరమా అని ప్రశ్నించారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే.. 40 కోట్ల ఎకరాల పంటకు 40వేల టీఎంసీలు పోగా మిగతా 30వేల టీఎంసీలలో ఐదారు వేల టీఎంసీలు పరిశ్రమలు, తాగునీటికి పోగా, మరో 25వేల టీఎంసీల నీరు మిగులుతుందన్నారు. ఇది నిజమా కాదా.. అనేది రాహుల్ గాంధీ, అమిత్ షా, మోడీ, మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పాలన్నారు.

హైదరాబాద్ నుంచి హెచ్చరిస్తున్నా.. తస్మాత్ జాగ్రత్త

హైదరాబాద్ నుంచి హెచ్చరిస్తున్నా.. తస్మాత్ జాగ్రత్త

రాష్ట్రాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు, ప్రాంతాలకు మధ్య నీటి యుద్ధాలు పెట్టారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.భారత దేశ రైతాంగాన్ని ఆ పార్టీలు నష్టపరిచాయన్నారు. తమ ఫెడరల్ ఫ్రంట్ నీటి యుద్ధాలను సర్దుబాటు చేస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమి నిజమైన ఫెడరల్ స్ఫూర్తితో ముందుకు సాగుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు తస్మాత్ జాగ్రత్త అన్నారు. హైదరాబాద్ నుంచి హెచ్చరిస్తున్నానని చెప్పారు. కావాల్సినంత నీరు ఉన్నా చేతులు ముడుచుకొని కూర్చున్నారని, మేం వస్తే మీ ముఖాలు వెలవెలపోయేలా చేస్తామన్నారు.

ట్రక్కుల నుంచి గూడ్స్ రైళ్ల వరకు

ట్రక్కుల నుంచి గూడ్స్ రైళ్ల వరకు

మన దేశంలో మౌలిక వసతులు కూడా దారుణంగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ఇతర దేశాల్లో ట్రక్కులు గంటకు 80 కిలో మీటర్ల వేగంతో వెళ్తాయని, మన దేశంలో అంతర్జాతీయ ట్రక్కులు మాత్రం 26 నుంచి 35 కిలోమీటర్లు మాత్రమే పోతాయన్నారు. చైనాలో గూడ్స్ రైళ్లు గంటకు 80 కిలోమీటర్లు వెళ్తే, మన వద్ద మాత్రం 24 కిలో మీటర్లు వెళ్తాయన్నారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ పాలనకు నిదర్శనం అన్నారు.

 పర్యాటక రంగం.. బీచ్‌లు

పర్యాటక రంగం.. బీచ్‌లు

ఈ మధ్య ఓ స్నేహితుడు బీచ్ కోసం బాలి వెళ్లారని, మన వద్ద సరైన సౌకర్యాలు లేవని చెప్పాడని కేసీఆర్ వెల్లడించారు. ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, ఇతర దేశాల కన్నా మన వద్ద ఎక్కువ సముద్రతీరం ఉందని, లక్ష్యద్వీప్‌ను ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చునని, మన ద్వీపాన్ని అభివృద్ధి చేయకుండా సన్నాసుల్లా పాలకులు ఉన్నారని మండిపడ్డారు. పర్యాటక రంగంలో వేల కోట్లు నష్టపోతున్నామన్నారు.

దేశంలో పోర్టులు

దేశంలో పోర్టులు

సింగపూర్ దేశం హైదరాబాదులో సగం ఉంటుందని, దానికి సముద్రతీరం 193 కిలోమీటర్లేనని, కానీ అక్కడ 4 కోట్ల కంటైనర్లు ఉన్నాయని, చైనా 19.5 కోట్ల కంటైనర్లు హ్యాండిల్ చేస్తోందని, మన వద్ద 7500 కిలో మీటర్ల సముద్ర తీరం ఉన్నా కనీసం కోటి కంటైనర్లు లేవని, 87 లక్షలే హ్యాండిల్ చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ నాయకత్వాన్ని నమ్ముకుంటే దేశం ముందుకు పోదన్నారు. ఇన్‌లాండ్ వాటర్ వేసు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. ఏ రంగంలో ముందుకు వెళ్లలేదన్నారు.

తలసరి ఆదాయం.. కాశ్మీర్ ఇష్యూ

తలసరి ఆదాయం.. కాశ్మీర్ ఇష్యూ

1962లో 180 బిలియన్ డాలర్ల తలసరి ఆదాయం భారత్‌లో ఉంటే చైనాకు 132 బిలియన్ డాలర్లు ఉండేదని, కానీ 2016లో చైనాకు 9వేలకు పైగా ఉంటే మనం ఇంకా రెండున్నర వేల వద్దే ఉన్నామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగు దశాబ్దాలలో చైనా పురోగమిస్తుంటే మనం మాత్రం ఇక్కడే ఉన్నామన్నారు. ఇక కాశ్మీర్ సమస్య దశాబ్దాలుగా అలాగే ఉందన్నారు. తనకు దుఖం, బాధ కలిగించేది ఎక్కడ అంటే రెండు పార్టీలు ప్రజలకు కథలు చెబుతూ వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. మనం వాస్తవాలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao warns BJP and Congress in TRS plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X