• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ కొత్త సచివాలయం కట్టిస్తుంది నాకోసమే.!ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా.?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా విజృంభణ నేపథ్యంలో రాజకియంగా సమావేశాలు తగ్గిపోయాయి. విలేఖరుల సమావేశాలు కూడా ప్రత్యక్షంగా నిర్వహించడం రాజకీయ నేతలు తగ్గించారు. అంతా ఆన్ లైన్ లో, జూమ్ లో వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. మీడియా సమావేశాలకు బదులు అందుబాటులో ఉన్న పాత్రికేయులతో చిట్ చాట్ లు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అన్ని పార్టీల నేతలు దాదాపు చిట్ చాట్ లకే ప్రాధాన్యతనిస్తున్న సందర్బాలు చోటుచేసుకుంటున్నాయి. పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి కూడా చిట్ చాట్ నిర్వహించి అనేక సంచలన అంశాలను మీడియతో షేర్ చేసుకుంటారు.

రేవంత్ సుధీర్గ చిట్ చాట్.. అనేక సంచలన అంశాలను షేర్ చేసుకున్న పీసిసి ఛీఫ్

రేవంత్ సుధీర్గ చిట్ చాట్.. అనేక సంచలన అంశాలను షేర్ చేసుకున్న పీసిసి ఛీఫ్

మంగళవారం మీడియా మిత్రులతో సుధీర్గంగా చిట్ చాట్ చేసారు రేవంత్ రెడ్డి. రాజకీయ పరిణామాల్లో చోటు చేసుకుంటున్న వేగవంతమైన మార్పులను గమనించి ప్రసారం చేయడంలో మీడియా కొంత వరకు వెరకబడి పోయిందనే అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేసారు. మార్పులను గమనించినప్పటికి యాజమాన్యాల తీరు, రాజకీయాల ఒత్తిడిల వల్ల ప్రసారం చేయలేకపోడవం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఒత్తడిలకు లొంగని కొన్ని మీడియా సంస్ధలు తటస్థ వార్తలకు ప్రాదాన్యతనివ్వడం హర్షించదగ్గ అంశమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ బలమైన నాయకుడు అనుకోవడం భ్రమ.. త్వరలో వినూత్న మార్పులు వస్తాయన్న రేవంత్

కేసీఆర్ బలమైన నాయకుడు అనుకోవడం భ్రమ.. త్వరలో వినూత్న మార్పులు వస్తాయన్న రేవంత్

అంతే కాకుండా తాజా రాజకీయాలపై తనదైన విశ్లేషణ అందిస్తుంటారు రేవంత్ రెడ్డి. దేశ రాజకీయాలకన్నా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చాలా సూక్ష్మంగా గమనిస్తుంటారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీల వ్యూహ రచనలు, అధికార పార్టీ విధానాలను పరిశీలిస్తుంటారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తనకు తాను పటిష్టంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్టు భ్రమపడతాడు తప్ప వాస్తవ పరిస్థితులు వేరే రకంగా ఉంటాయని రేవంత్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా అదే ఊహల్లో ఉంటున్నారని, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్ధితులు చంద్రశేఖర్ రావు ఆలోచనలకు చాలా విరుద్దంగా ఉన్నాయని స్పష్టం చేసారు.

వచ్చే ఎన్నికలో ఎవరిని గెలిపించాలో ప్రజలకు తెలుసు.. ప్రజా నిర్ణయం ఐపోయిందన్న రేవంత్ రెడ్డి

వచ్చే ఎన్నికలో ఎవరిని గెలిపించాలో ప్రజలకు తెలుసు.. ప్రజా నిర్ణయం ఐపోయిందన్న రేవంత్ రెడ్డి

ఇదిలా ఉండగా తెలంగాణలో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల కన్నా భవిష్యత్ రాజకీయాల పట్ల ప్రజలు ఎంతో స్పష్టతతో ఉన్నారని వివరించారు. రాబోవు ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించాలి, ఎవరికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి అనే అంశం పట్ల ప్రజలు ఎంతో పరిణతితో వ్యవహరించబోతున్నారని స్పష్టం చేసారు. ఈ అంశాలన్నీ సీఎం చంద్రశేఖర్ రావుకు తెలియనివి కాదని, అందుకే వ్యవస్థలను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి తెర తీసారని వివరించారు. ప్రభావవంతంగా పనిచేసే ఏవ్యవస్థనైనా తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం సీఎం చంద్రశేఖర్ రావు చేస్తున్నారని రేవంత్ తెలిపారు.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తనకోసమేనన్న రేవంత్

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తనకోసమేనన్న రేవంత్

అంతే కాకుండా సీఎం పదవి మార్పు గురించి కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రమంతా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు ముహర్తం ఖరారయ్యిందినే చర్చ జరుగుతున్నప్పుడు కూడా అలాంటి పరిణామాలు కలలో కూడా జరగవని తాను బల్లగుద్ది చెప్పానని గుర్తుచేసారు. సంతోష్ కుమార్ ను ఎంపీని చేసి హరీష్ ప్రాధాన్యతను చంద్రశేఖర్ రావు తగ్గిస్తారని గతంలో తాను చెప్పానని, ఇప్పుడు అదే జరిగింది కదా అని చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఎప్పటికి సీఎం కాలేడని వ్యాఖ్యానించారు. మరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయం సంగతి ఏంటని విలేఖరులు ప్రశ్నించగా ఊహించని సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి. దేశమంతా కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఏర్పడిందని, తెలంగాణలో కూడా అవే పవనాలు వీస్తున్నాయని, నూతన సెక్రటేరియట్ తన కోసమే చంద్రశేఖర్ రావు నిర్మిస్టున్నాడని రేవంత్ సంచలన అంశాన్ని వెల్లడించారు.

English summary
Revanth Reddy had a lengthy chit chat with media friends on Tuesday. Rewanth Reddy opined that the media was somewhat reluctant to broadcast the rapid changes taking place in the political arena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X