హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్చకులకు దసరా కానుక: నవంబర్‌ నుండి ప్రభుత్వ పే స్కేల్

తెలంగాణలోని అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా సందర్భంగా కానుకను అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే అర్చకులకు కూడా పేస్కేల్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వంప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా సందర్భంగా కానుకను అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే అర్చకులకు కూడా పేస్కేల్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వంప్రకటించింది.

ప్రగతి భవన్ లో శుక్రవారం నాడు అర్చకులతో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అర్చకుల సమస్యలు, ఆలయాల నిర్వహణ, వేతనాలు పెంపు, ధూపదీప నైవేద్యాలు తదితర అంశాలపై చర్చించారు.

KCR will implement to priests governament pay scale from coming November

నవంబర్ నుంచి అర్చకులు, ఆలయాల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పేస్కేలు అమలు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి కెసిఆర్. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో మొత్తం 5,625 మంది అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు అందుతాయని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందుతాయని చెప్పారు

ప్రస్తుతం రాష్ట్రంలోని 1,805 దేవాలయ్యాల్లో ధూపదీప నైవేద్యాలు అమలవుతున్నాయని... ఈ పథకాన్ని మరో 3 వేల దేవాలయాలకు వర్తింపు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

దేవాలయాల నిర్వహణ పర్యవేక్షణకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తామని... దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గిస్తామని తెలిపారు. ఆలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
Telanga Chief minister KCR announed that priests and employees working in temples will be given state governament pay scales coming November.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X