హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్పభక్తుల సౌకర్యార్ధం శబరిమలైలో తెలంగాణ భవనం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని త్వరలో కేటాయించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చెప్పారు.

శబరిమలై యాత్ర నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల దేవాదయ శాఖ మంత్రులు, కార్యదర్శులతో కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలో గురువారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎం ఊమెన్ చాందీ మట్లాడుతూ తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించేందుకు నిర్ణయించామని, త్వరలోనే ఆ ప్రక్రియ కొలిక్కి వస్తుందని చెప్పారు.

సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు శబరిమలైలో ప్లాస్టిక్‌పై నిషేధం అమలు చేస్తున్నామని, ఈ నేపథ్యంలో భక్తులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతులు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర దేవాదయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భవన్‌కు స్ధలం కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ఊమెన్ చాందీకి కృతజ్ఞతలు తెలిపారు.

శబరిమలైకి వచ్చే భక్తులకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తెలుగు మాట్లడేవారిని కంట్రోల్ రూమ్‌లో ఉండేలా చూడాలని ఆయన కోరారు. వసతులు, భోజనాలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చూడాలని సూచించారు.

ప్లాస్టిక్ నిషేధం అమలు దృష్ట్యా భక్తులను చైతన్య పరిచేందుకు త్వరలో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. కేరళలోని పరిస్థితులు, ఏర్పాట్లపై అవగాహన కోసం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించాలని మంత్రి చేసిన విజ్ఞాపనపై కేరళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి

తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్పభక్తుల సౌకర్యార్ధం శబరిమలైలో తెలంగాణ భవనం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని త్వరలో కేటాయించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చెప్పారు.

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి

శబరిమలై యాత్ర నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల దేవాదయ శాఖ మంత్రులు, కార్యదర్శులతో కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలో గురువారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎం ఊమెన్ చాందీ మట్లాడుతూ తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించేందుకు నిర్ణయించామని, త్వరలోనే ఆ ప్రక్రియ కొలిక్కి వస్తుందని చెప్పారు.

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి

సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు శబరిమలైలో ప్లాస్టిక్‌పై నిషేధం అమలు చేస్తున్నామని, ఈ నేపథ్యంలో భక్తులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతులు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర దేవాదయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భవన్‌కు స్ధలం కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ఊమెన్ చాందీకి కృతజ్ఞతలు తెలిపారు.

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి

శబరిమలైకి వచ్చే భక్తులకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తెలుగు మాట్లడేవారిని కంట్రోల్ రూమ్‌లో ఉండేలా చూడాలని ఆయన కోరారు. వసతులు, భోజనాలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చూడాలని సూచించారు.

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి

శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి

ప్లాస్టిక్ నిషేధం అమలు దృష్ట్యా భక్తులను చైతన్య పరిచేందుకు త్వరలో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. కేరళలోని పరిస్థితులు, ఏర్పాట్లపై అవగాహన కోసం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించాలని మంత్రి చేసిన విజ్ఞాపనపై కేరళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

English summary
Kerala government will conduct an awareness meeting soon in Hyderabad for the benefit of pilgrims planning to go to Sabarimala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X