వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ మహల్ నుంచి వచ్చావు, మీ ఊరికి రా, ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నావు: లక్ష్మీపార్వతిపై కేతిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి ప్రవర్తనలో మార్పు రావాలని, ఆ దుష్టశక్తి బారి నుంచి కాపాడమని కోరుతూ లక్ష్మీస్ వీరగ్రంథం చిత్ర దర్శకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గురువారం అరస

|
Google Oneindia TeluguNews

Recommended Video

లక్ష్మీపార్వతి ఎలాంటిదో ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ! అన్నగారి ధర్మపత్ని కాదు ? | Oneindia Telugu

శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి ప్రవర్తనలో మార్పు రావాలని, ఆ దుష్టశక్తి బారి నుంచి కాపాడమని కోరుతూ లక్ష్మీస్ వీరగ్రంథం చిత్ర దర్శకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గురువారం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని పూజించారు.

లక్ష్మీపార్వతి నుంచి రక్షించండి: కేతిరెడ్డి, ఎన్టీఆర్ సొంతూరులో షాకిచ్చారులక్ష్మీపార్వతి నుంచి రక్షించండి: కేతిరెడ్డి, ఎన్టీఆర్ సొంతూరులో షాకిచ్చారు

ఈ చిత్రాన్ని అడ్డుకోవలని లక్ష్మీపార్వతి ప్రయత్నం చేస్తున్నారని, ఆ దుష్టశక్తి బారి నుంచి కాపాడమని ఆయన పూజలు నిర్వహించడం గమనార్హం. ఆ తర్వాత ఆమెలో మార్పు కోరుతూ ఎన్టీఆర్ ఆత్మశాంతి యాత్ర చేపట్టారు.

 లక్ష్మీపార్వతి ఏ రాజమహల్ నుంచి వచ్చావు

లక్ష్మీపార్వతి ఏ రాజమహల్ నుంచి వచ్చావు

ఇందులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలిలో గల ఎన్టీఆర్ శిలా విగ్రహాన్ని పాలతో కడిగి నివాళులు అర్పించారు అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తమను ప్లాట్ ఫాంగాళ్లు అన్న లక్ష్మీ పార్వతి ఏ రాజమహల్ నుంచి వచ్చారో ప్రజలకు చెప్పాలని కేతిరెడ్డి నిలదీశారు.

 మీ ఊళ్లో చర్చకు సిద్ధమా, అంత శక్తి ఉందా

మీ ఊళ్లో చర్చకు సిద్ధమా, అంత శక్తి ఉందా

లక్ష్మీపార్వతి పుట్టిన గుంటూరు జిల్లా బచ్చల తాటిపర్రులో బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా, షూటింగ్ పోలీస్ వారు ఆపితే మా నిర్మాత నీకు ఫోన్ చేసి మిమ్మల్ని అర్థించాడని చెబుతున్నావని, షూటింగ్‌ను ఆపే శక్తి నీకు ఉంటే, మీరే వచ్చి ఆపవచ్చు కదా అని నిలదీశారు.

ఆ ప్లాట్ ఫాంగాడి పోస్టర్ రిలీజ్ ఫంక్షన్లో ఎలా పాల్గొన్నావు

ఆ ప్లాట్ ఫాంగాడి పోస్టర్ రిలీజ్ ఫంక్షన్లో ఎలా పాల్గొన్నావు

తనకు ప్రాణ రక్షణ ఉందని, చాలామంది తనను బెదిరిస్తున్నారని కేతిరెడ్డి అన్నారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలు తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తనను ప్లాట్ ఫాం గాడు అన్న లక్ష్మీపార్వతి, ఆ ప్లాట్ ఫాం గాడు నిర్వహించిన పోస్టర్ల రిలీజ్ ఫంక్షన్లో ఎలా అతిథిగా పాల్గొన్నారని నిలదీశారు.

 లక్ష్మీపార్వతి అలా చెప్పలేదా

లక్ష్మీపార్వతి అలా చెప్పలేదా

ఆదివారం తమ చిత్రం ప్రారంభోత్సవం అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే లక్ష్మీపార్వతి తాను ఆత్మహత్య చేసుకుంటానని బంజారాహిల్స్ పోలీసులకు చెప్పారని కేతిరెడ్డి మండిపడ్డారు. కష్టాల కడలిని అనుభవిస్తున్నానని, మూడు ముళ్ల పెళ్లికి ముప్పై ఏళ్ల వైవిధ్యాన్ని అనుభవిస్తున్నానని మీరు మా నిర్మాతతో చెప్పలేదా అని నిలదీశారు.

 లక్ష్మీపార్వతి ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారు

లక్ష్మీపార్వతి ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారు

తమతో ఓ రకంగా, మీడియా ముందు మరో రకంగా మాట్లాడుతున్నారని కేతిరెడ్డి ఆమెపై నిప్పులు చెరిగారు. అన్నగారి ధర్మపత్నిని అని చెప్పుకునే మీ భాష దారుణంగా, దిగజారుడుగా ఉందన్నారు. ఎన్టీఆర్ పైన వెకిలి సినిమాలు తీస్తే సహృదయంతో నవ్వుతూ స్వీకరించేవారని, మీరు మాత్రం మీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారని విమర్శించారు.

 ఎన్టీఆర్ పరువు తీయవద్దు

ఎన్టీఆర్ పరువు తీయవద్దు

లక్ష్మీపార్వతి ద్వంద్వ నీతిని ప్రజలు గమనిస్తున్నారని కేతిరెడ్డి అన్నారు. దానిని మార్చుకోవాలన్నారు. ఎన్టీఆర్ పరువు తీయవద్దన్నారు. కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారని, మీరు వెళ్లేటప్పుడు పిలిక్తే నేను వస్తానని, ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అందుకు సిద్ధమా అన్నారు.

English summary
Kethireddy Jagadeswar Reddy fired at YSR Congress Party leader Laxmi Parvathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X