వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"దమ్మున్న నేత కేసీఆర్, మోడీ కన్నా గొప్ప నాయకుడు"

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: .తెలుగువాడి సత్తా ఏమిటో దేశానికి చూపిస్తానని అన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు తరతరాలుగా విభజించు పాలించు అనే సూత్రంతో దక్షిణాది ని వివక్షకు గురిచేస్తున్న ఉత్తరాది నాయకత్వానికి ఒక చెంప పెట్టు అని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో దక్షిణాది నాయకులందరూ నడిచి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణాదివాడి సత్తా ఉత్తరాది వారికి చూపించి గుణాత్మకమైన మార్పుతో దేశాన్ని ఒక నూతన దిశగా ముందుకు నడిపించేందుకు ప్రయత్నించాలని అన్నారు.

పార్టీలకు అతీతంగా ముందుకు..

పార్టీలకు అతీతంగా ముందుకు..

దక్షిణాది నాయకులందరూ పార్టీలకు అతీతంగా,మేమంతా ఒకటే అనే సంకేతం ఇచ్చి, కేంద్ర నాయకత్వానికి బుద్ధి చైప్పడానికి ప్రజలందరూ కదలి రావాలని ,పార్టీలన్నీ కలసిరావాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ మోడీ కన్నా గొప్ప నేత

కేసీఆర్ మోడీ కన్నా గొప్ప నేత

అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కల అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ప్రజా ఉద్యమాల ద్వారా సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ కంటే గొప్ప ప్రజానేత అని, ఎందరో మహానుభావుల త్యాగాల ప్రతిఫలం వల్ల బీజేపీ అనే పార్టీ ఈ దశకు చేరిందని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ వంటి నేత అవసరం

కేసీఆర్ వంటి నేత అవసరం

టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కొరకు పుట్టిన పార్టీ అని, కులాల,మతాల ఎజండాతో వచ్చిన పార్టీ కాదని, కేసీఆర్ మా నిజాయితీకి నిదర్శనమని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకపోవడంపై కెసీఆర్ చెప్పిన మాటలను అందరూ మెచ్చుకన్నారని కేతిరెడ్డి తెలిపారు

జయ మరణం తర్వాత..

జయ మరణం తర్వాత..

జయలలిత మరణం తరువాత వేరే పార్టీ వ్యవహారాల్లో బిజెపి జోక్యం చేసుకోవడమంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ను ఉల్లంఘించడమేనని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. పన్నీర్ సెల్వం స్వయంగా తాను ప్రధాని మోడీ అదేశం మేరకు ఉప ముఖ్యమంత్రి గా ఉన్నానని చెప్పడం బిజెపి ఇతర పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని చెప్పడానికి నిదర్శనమని అన్నారు.

ఆర్కె నగర్ ఫలితం కేంద్రానికి గుణపాఠం

ఆర్కె నగర్ ఫలితం కేంద్రానికి గుణపాఠం

ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రమేయానికి వ్యతిరేకంగా ప్రజలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటునప్పటికి దినకర్‌కు విజయాన్ని చేకూర్చి కేంద్ర నాయకత్వానికి ఒక గుణపాఠం ఇచ్చారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్టాల కేంద్రానికి పన్నుల నిష్పత్తిలో ఎక్కువ చైలించినప్పటికి ,అభివృద్ధి నిష్పత్తిలో మాత్రం దక్షిణాది వేనుకబడి ఉందని, దక్షిణాది వివక్షకు గురి అవ్వుతుందని చైపై ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని అన్నారు.

ఎన్టీఆర్‌‌ను ఇలా చేశారు...

ఎన్టీఆర్‌‌ను ఇలా చేశారు...

జయలలిత, ఎన్.టీ. రామారావుల మరణంతో దక్షిణాది ప్రాంతంలో నాయకత్వలేమి వల్ల అటు ప్రజలతో, ఇటు ప్రభుత్వాలతో కేంద్రం ఆటలు అడుకుంటోందని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ ఇది అంత గమనిస్తూ ఉన్నారని, నేషనల్ ఫ్రంట్ ను పెట్టి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక కూటమికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో పరాజయం పొందిన తర్వాత ఎన్టీఆర్ ను కనీసం నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి కడా ఆహ్వానించకపోవడం దక్షిణాది నాయకులపై ఉత్తరాది వివక్షకు నిదర్శమని అన్నారు.

కేసీఆర్ దమ్మున్న నేత

కేసీఆర్ దమ్మున్న నేత

కేంద్ర నాయకత్వంపై యుద్ధానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ ఒక దమ్ము ఉన్న నాయకుడని, ప్రధాని తప్పు చేస్తే విమర్శించకూడదని రాజ్యాంగంలో ఉందా, అధికార మార్పిడి తప్పితే బీజేపీ పాలనలో గుణాత్మకమైన మార్పులేదని కేతిరెడ్డి జగదీశ్ర్వర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దక్షిణాది నాయకులందరూ నడిచి ఉత్తరాది వారికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి బుద్ధి చెప్పాలని అన్నారు.

English summary
Tamil Nadu Telugu Yuva shakti pesident Kethireddy Jagadeeswar Reddy has suppord Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X