వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఎస్‌పీఎస్సీలో రహస్య గదిలో కీలక డాక్యుమెంట్లు మిస్: సీమాంధ్ర ఉద్యోగులేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ వింగ్‌లోని కీలక దస్ర్తాలు మాయమయ్యాయి. ఈ విషయమై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో టీఎస్‌పీఎస్సీ అధికారులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాన్ఫిడెన్షియల్ వింగ్‌లోని కీలక దస్ర్తాలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రహస్య గదిని నకిలీ తాళాలతో తెరిచి ఫైళ్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కీలక దస్ర్తాల అపహరణపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కీలక దస్ర్తాలను సీమాంధ్ర ఉద్యోగులే అపహరించి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఏపీఎస్సీ ఉద్యోగులు కాన్ఫిడెన్షియల్ గదిలోకి వెళ్లి అక్రమంగా ప్రవేశించారని టిఎన్జీవో నేత విఠల్ ఆరోపించారు. మా అనుమతుల్లేకుండానే మా గదుల్లోకి వచ్చారన్నారు.

Key documents missing from TSPSC confidential wing

అభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర: జగదీష్‌రెడ్డి

నల్గొండ జిల్లాలోని బోయిన్‌పల్లిలో మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అభివృద్ధిలో మహిళా సంఘాలదే కీలకపాత్ర అన్నారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు.

తెలంగాణలో ప్రతీ పల్లె గంగదేవిపల్లి అయితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో రాజకీయాలకతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొంటున్నారని చెప్పారు.

నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం మెల్వలపల్లిలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గ్రామజ్యోతిలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంట్లో టాయిలెట్లు నిర్మించుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో మహిళా సంఘాలు, యువజన సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు.

పౌష్టికాహార లోపంతో చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బందులు పడకుండా చూడాలని, ప్రతీ గ్రామంలో డంపింగ్ యార్డులు నిర్మించి చెత్తను తరలించాలన్నారు. కమిటీలు క్రియాశీలకంగా పని చేసేలా గ్రామస్థులే చొరవ తీసుకోవాలని సూచించారు. సమన్వయంతో ముందుకు వెళ్తే అభివృద్ధి సాధ్యమన్నారు.

English summary
Key documents missing from TSPSC confidential wing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X