హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాది నా స్థాయి కాదు, కానీ: ప్రెఫొసర్ కాళ్లకు పవన్ కళ్యాణ్ నమస్కారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయు) ప్రొఫెసర్ సుధాకర రావు కాళ్లకు నమస్కరించారు. హైదరాబాదులోని శేరిలింగంపల్లిలో సుధాకర రావుకు సన్మానం చేశారు.

Recommended Video

జనసేనలో చేరిన మాజీ మంత్రి ముత్తా గోపాల‌కృష్ణ

కేసీఆర్‌పై ఉత్తమ్ నిప్పులు: రాహుల్ గాంధీ భేటీలో నారా బ్రాహ్మణికేసీఆర్‌పై ఉత్తమ్ నిప్పులు: రాహుల్ గాంధీ భేటీలో నారా బ్రాహ్మణి

ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. లక్ష మంది ముందు మాట్లాడేందుకు ధైర్యం ఉంటుంది కానీ, లక్షమంది మేథస్సులను కదిలించగల సుధాకర రావు గురించి మాట్లాడటం నా అదృష్టం అన్నారు. సుధాకర్ రావుకు ఉన్న మేధస్సు కానీ, తపన కానీ తనకు లేవని చెప్పారు. అయితే, నేర్చుకోవాలన్న తపన మాత్రం ఉందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తాను పని చేస్తున్నానని తెలిపారు.

నిజంగా నాకు అంత అర్హత, స్థాయి లేదు

నిజంగా నాకు అంత అర్హత, స్థాయి లేదు

సమాజాన్ని ప్రభావితం చేసే విద్యావేత్తలు, ప్రొపెసర్ల ముందు మాట్లాడాలంటే సాధారణంగానే భయంగా ఉంటుందని, అలాంటిది ఇలాంటి ప్రొఫెసర్ గురించి మాట్లాడాలంటే భయమేసి తనలో ఉన్న అక్షరాలు కూడా ఎగిరిపోయాయన్నారు. తనకు భయమేసిందన్నారు. కీనోట్ స్పీచ్ ఇచ్చేంత అర్హత, స్థాయి తనకు లేదన్నారు. మీ ప్రేమ, ఇష్టం వల్ల ఇస్తున్నానని చెప్పారు.

పావు గంట అనుకుంటే రెండు గంటలు మాట్లాడుకున్నాం

పావు గంట అనుకుంటే రెండు గంటలు మాట్లాడుకున్నాం

మీకు ఉన్నంత మేథస్సు తనకు లేదని, కానీ నేర్చుకోవడానికి తపన పడతానని పవన్ అన్నారు. ఇంతమంది ప్రొఫెసర్ల ముందు మాట్లాడటం ఇబ్బందే అన్నారు. సుధాకర్ రావు గురించి చెప్పాలంటే.. శ్రీపతి రాములు ద్వారా తాను ఆయనను కలిశానని చెప్పారు. తొలిసారి కలిసినప్పుడు పావుగంట పాటు సుధాకర రావుతో మీటింగ్ అని తనకు చెప్పారని, కానీ తామిద్దరం రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నామన్నారు. ఆయన తీరు తనకు నచ్చిందన్నారు.

ముంబై షార్ట్ ఫిలిం

ముంబై షార్ట్ ఫిలిం

1990లలో తాను ముంబైకి షార్ట్ ఫిలిం ఫెస్టివెల్‌కు వెళ్లానని పవన్ చెప్పారు. గిరిజనుల జాతులు ధ్వంసం అవుతున్నట్లు తాను పలు సందర్భాల్లో తెలుసుకున్నానని చెప్పారు. ఆ రోజు సుధాకర రావుతో మాట్లాడినప్పుడు జాతుల గురించి మాట్లాడారన్నారు. ఇటీవల తాను రాష్ట్రంలో తిరుగుతున్న సమయంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారు వెనుకబడిన తీరు చూశానని చెప్పారు. తనది పరిమితమైన మేథస్సు అని, సుధాకర రావు, ఇతర ప్రొఫెసర్లు ప్లాట్ ఫాం క్రియేట్ చేస్తే తాను ముందుకు వస్తానని చెప్పారు.

 సంచార జాతుల జీవనంపై

సంచార జాతుల జీవనంపై

ప్రసంగం ముగించిన తర్వాత పవన్ నేరుగా సుధాకర్ రావు వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు. సుధాకర్ రావు గత నెలలో రిటైర్ అయ్యారు. సంచార జాతుల జీవనంపై 'ఎతనోగ్రఫీ ఆఫ్ ఎ నోమాడిక్ ట్రైబ్' అనే పుస్తకాన్ని రాశారు. సంచార జాతుల జీవనం గురించి ప్రపంచానికి తెలియజేసిన ఆయన సేవలు గొప్పవని పవన్ కొనియాడారు.

English summary
Key Note address by Jana Sena chief Pawan Kalyan at Superannuation Felicitation of N.Sudhakar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X