హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: కోర్టు హాలులో కుప్పకూలిన మేజిస్ట్రేట్, మృతి

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: విధి నిర్వహణలో ఉన్న ఓ మేజిస్ట్రేట్ కోర్టు హాలులోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా భద్రాచలం మేజిస్ట్రేట్ కోర్టులో చోటు చేసుకుంది. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సంజీవరావు తన బాధ్యతలను నిర్వహిస్తున్న సమయంలో ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యారు.

ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన మరణించారు. జరిగిన ఘటనతో కోర్టు ఆవరణలో ఉన్న వారంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. కోర్టులో ఆవరణలో విషాద వాతావరణం నెలకొంది.

గాంధీలో స్వైన్‌ప్లూతో మహిళ మృతి

Khammam magistrate dies with heart attack

హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. హెచ్‌1ఎన్1 వైరస్ జనాలపై దాడి చేస్తోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతి చెందింది.

మృతురాలి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో బాధ పడుతూ ఇద్దరు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం ఆములూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను, క్షతగాత్రుడిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నంబర్.. టీఎస్ 06 ఏఈ 1999.

English summary
A magistrate in Khammam district died with heart attack in Court premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X