హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆన్‌లైన్‌లో రెండు తలల పాములతో బిజినెస్: ఖమ్మం సాప్ట్‌వేర్ ఉద్యోగి అరెస్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అరుదైన రెండు తలల పాములను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారి కోటేశ్వరరావు వెల్లడించిన కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన పుష్పాల నరేష్ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

స్వతహాగా వన్యప్రాణులంటే ఇష్టపడే నరేష్ తన వద్ద ఉన్న రెండు తలల పాములు మూడింటిని ఆన్‌లైన్‌లో వాటిని అమ్మకానికి పెట్టాడు. ఈ విషయాన్ని వన్యప్రాణులను సంరక్షించే తమిళనాడుకు చెందిన ఓ స్వచ్చంధ సంస్ధ కనిపెట్టింది.

తమిళనాడుకు చెందిన ఆ స్వచ్చంధ సంస్ధ సభ్యుడైన బాలాజీ అనే వ్యక్తి తాను ప్రస్తుతం పూణెలో నివసిస్తున్నానని, తనకు రెండు తలల పాము కావాలని వాటిని కొంటానని నరేశ్‌తో బేరమాడాడు. అతడి మాటలను నమ్మిన నరేశ్ ఖమ్మం బస్టాండ్‌కు రావాలని సూచించాడు.

Khammam software employee sell two heads snake in online

దీంతో తమిళనాడు నుంచి ఖమ్మం బస్టాండ్‌కు బాలాజీ వచ్చాడు. బస్టాండ్‌కు వచ్చిన తర్వాత పనిలో పనిగా ఈ రెండు తలల పాములను కొంటున్న విషయాన్ని ఖమ్మం జిల్లా పోలీసులకు సమాచారమిచ్చాడు. ఇంకేముంది ఖమ్మం జిల్లాకు చెందిన ఫ్లైయింగ్ స్క్వాడ్ రేంజ్ అధికారి కోటేశ్వరరావు, సిబ్బందితో మాటువేసి శనివారం రాత్రి నరేశ్‌ను పట్టుకున్నారు.

అతని వద్దనున్న కారు, అందులోని రెండు తలల పాములు మూడింటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడితోపాటు వాటిని అటవీశాఖ జిల్లా కార్యాలయానికి తరలించారు. అనంతరం పాములకు వైద్యం అందించి సమీపంలోని అడవుల్లోకి వదిలారు.

English summary
Khammam software employee sell two heads snake in online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X