వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధుతో పాటు ముగ్గురికి ఖేల్ రత్న, ఆరుగురికి ద్రోణాచార్య అవార్డులు: కేంద్రం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2016 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది. రియో ఒలింపిక్స్‌లో భారత్ తరుపున మెరిసిన నలుగురు ఒలింపిక్స్ స్టార్లకు రాజీవ్ ఖేల్ ర‌త్న పుర‌స్కారం ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు పేర్కొంది.

National Sports Awards - 2016 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన పీవీ సింధు (బ్యాడ్మింటన్), కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ (రెజ్లింగ్)లకు ఖేల్ రత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. వీరితో పాటు రియో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్)లను కూడా ఖేల్ రత్న అవార్డుకి కేంద్రం ఎంపిక చేసింది.

Khel Ratna award to be conferred on PV Sindhu, Dipa Karmakar, Jitu Rai, Sakshi Malik

అదే విధంగా ఆరుగురికి ద్రోణాచార్య పుర‌స్కారం అందించ‌నున్న‌ట్లు తెలిపింది. దీపా క‌ర్మాక‌ర్ కోచ్ విశ్వేశ్వ‌ర్ నందికి ద్రోణాచార్య అవార్డు ప్ర‌క‌టించింది. నాగ‌పురి ర‌మేశ్‌(అథ్లెటిక్స్‌), సాగ‌ర్ మాల్ ధ్యాయ‌ల్ (బాక్సింగ్‌), రాజ్‌కుమార్ శ‌ర్మ‌ (క్రికెట్‌), ప్ర‌దీప్ కుమార్ (స్విమ్మింగ్‌), మ‌హావీర్ సింగ్ (రెజ్లింగ్‌)ల‌కు ద్రోణాచార్య పుర‌స్కారం అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

15 మందికి అర్జున అవార్డులు:
రజత్ చౌహాన్ (ఆర్చ‌రీ), ల‌లితా బాబ‌ర్ (అథ్లెటిక్స్‌), సౌర‌వ్ కొఠారి (బిలియ‌ర్డ్స్‌), శివ‌థాపా(బాక్సింగ్‌), అజింక్యా ర‌హానే(క్రికెట్‌), సుబ్ర‌తా పాల్‌(ఫుట్‌బాల్‌), రాణి(హాకీ), వీఆర్ ర‌ఘునాథ్‌(హాకీ), గురుప్రీత్‌సింగ్(షూటింగ్‌), అపూర్వి చందేలా(షూటింగ్‌), సౌమ్య‌జిత్ ఘోష్‌(టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్‌), అమిత్‌కుమార్‌(రెజ్లింగ్‌), సందీప్‌సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్‌), వీరేంద్ర సింగ్‌(రెజ్లింగ్‌-బ‌ధిర‌)

ముగ్గురికి ధ్యాన్‌చంద్ అవార్డులు:
స‌త్తి గీత‌(అథ్లెటిక్స్‌), సివ్లాన‌స్ ధంగ్ ధంగ్‌(హీకీ), రాజేంద్ర ప్ర‌హ్లాద్ షెల్కె (రోయింగ్‌)

English summary
Indian government will confer the Rajiv Gandhi Khel Ratna award​ on PV Sindhu, Dipa Karmakar, Jitu Rai and Sakshi Malik.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X