వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేనాని పవన్‌ను కలిసిన కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. ఏం చర్చించారంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కలిశారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తమై హైదరాబాదులో ఉన్న కిచ్చ సుదీప్ తన సహ నటుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా షూటింగులకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కిచ్చ సుదీప్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో షూటింగ్స్ పరిస్థితిపై కూడా ఆరా తీసినట్లు సమాచారం.

ప్రస్తుతం సుదీప్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అన్‌లాక్‌లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో ఇండస్ట్రీలో సినిమా షూటింగులు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే పలు భారీ సినిమాలు కూడా పట్టాలెక్కాయి. ఇక జనసేన బీజేపీ పొత్తు వ్యవహారంలో కర్నాటకకు చెందిన సీనియర్ బీజేపీ నేత బీఎల్ సంతోష్ కీలక పాత్ర పోషించారు. ఇతను సూపర్ స్టార్ సుదీప్‌కు సన్నిహితుడని తెలుస్తోంది.

Kicha Sudeep meets Janasena Chief Pawan kalyan, discuss current issues and shootings after unlock

ఇక సుదీప్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కన్నడ నటుడు అంబరీష్ భార్య సుమలత తరపున కిచ్చా సుదీప్ ప్రచారం చేశారు. అయితే తోటి నటుడిగా మాత్రమే సుమలత తరపున ప్రచారం చేసినట్లు క్లారిటీ ఇచ్చారు సుదీప్. ఇక ఈ రోజు పవన్‌తో భేటీ సందర్భంగా కిచ్చా సుదీప్ ఏపీ రాజకీయాలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. అదే సమయంలో పవన్ నటిస్తున్న వకీల్ సాబ్‌తో పాటు మరికొన్ని చిత్రాల వివరాలను కూడా సుదీప్ అడిగి తెలుసుకున్నాడు. పవన్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై తోటి నటుడిగా ఆనందంగా ఉందన్నారు సుదీప్. ఇక రాజకీయాల్లో కూడా పవన్ ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

Recommended Video

సీఎంకు చెప్పినా ఫలితం లేదు: కాఫీ ఎస్టేట్ యజమాని

ఇక సుదీప్ సినిమా కెరీర్ విషయానికొస్తే బచ్చన్-2 తోపాటు అశ్వథామ, ఫాంటమ్, కోటిగొబ్బ -3, బిల్లా రంగా బాషా, రవి బోపన్న, కన్వర్‌లాల్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

English summary
Kannada Super star Kicha Sudeep had met Janasena Chief Pawan Kalyan and discussed various current issues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X