హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారులను ఎత్తుకెళుతున్నారు.. 30 వేల వరకు అమ్మేస్తున్నారు.. హైదరాబాద్‌లో కిడ్నాపర్ల గుట్టురట్టు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : కిడ్నాపర్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. పాతబస్తీ ఏరియాలో పిల్లలను ఎత్తుకెళుతూ కొన్ని రోజులుగా చెలరేగిపోతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారం రోజుల కిందట తమ కొడుకు కనిపించడం లేదని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చాంద్రాయణగుట్ట పోలీసులు కిడ్నాపర్ల ఆట కట్టించారు. ఆ గ్యాంగ్ బారి నుంచి ముగ్గురు చిన్నారులను రక్షించారు.

పాతబస్తీకి చెందిన చీరల వ్యాపారి ఫజల్ అహ్మద్ తన కొడుకు కనిపించడం లేదంటూ.. వారం కిందట చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. దాంతో కిడ్నాపులకు పాల్పడుతున్న నలుగురు మహిళల ముఠా గుట్టురట్టైంది.

<strong>వైరల్ : మండలాధ్యక్షుడికి మంత్రి సిఫార్సు.. మల్లన్న లెటర్‌ హెడ్‌పై సెటైర్లు</strong>వైరల్ : మండలాధ్యక్షుడికి మంత్రి సిఫార్సు.. మల్లన్న లెటర్‌ హెడ్‌పై సెటైర్లు

kidnap gang busted in hyderabad old city

ఇంటి ముందు ఆడుకునే పిల్లలే టార్గెట్ గా ఈ గ్యాంగ్ రెచ్చిపోతోంది. మాయమాటలు చెబుతూ చిన్నారులను అపహరిస్తున్నారు. పిల్లలు లేని వారిని గుర్తించి చిన్నారులను అమ్మేస్తున్నారు. ఒక్కో చిన్నారిని 10 వేల నుంచి 30 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఇదివరకు ఈ గ్యాంగ్ ఇతర కిడ్నాపులకు పాల్పడిందా?.. ఇంకా ఎంతమందిని కిడ్నాప్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు.

English summary
Hyderabad police were arrested kidnap gang and saved three children. Four members of kidnap gang taken into custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X