వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాప్ చేసిన బాలుడ్ని పెట్రోల్ పోసి దారుణంగా ... వదిలేది లేదన్న జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

|
Google Oneindia TeluguNews

మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్ట్ కుమారుడి కిడ్నాప్ పెద్ద విషాదంగా ముగిసింది. కిడ్నాప్ చేసిన వ్యక్తి దొరికిపోతాననే భయంతో బాలుడు దీక్షిత్ రెడ్డిని హతమార్చి ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. హత్య చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. నిందితుడికి ఖచ్చితంగా ఉరి శిక్ష పడే విధంగా అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని ఈ కేసులో ఇప్పటి వరకు 24 మందిని విచారించాలని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు.

జర్నలిస్ట్ కుమారుడి కిడ్నాప్ కేసు .. గుట్టల్లో బాలుడ్ని చంపేసిన కిడ్నాపర్లుజర్నలిస్ట్ కుమారుడి కిడ్నాప్ కేసు .. గుట్టల్లో బాలుడ్ని చంపేసిన కిడ్నాపర్లు

బాలుడి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

బాలుడి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్ పట్టణానికి చెందిన రంజిత్ రెడ్డి జర్నలిస్టుగా పని చేస్తున్నారు. అతని కుమారుడు దీక్షిత్ రెడ్డి నాలుగో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేశారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరుగగా అప్పటినుండి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

దానమయ్య గుట్టపై బాలుడి గొంతు నులిమి ఆపై పెట్రోల్ పోసి ఘాతుకం

దానమయ్య గుట్టపై బాలుడి గొంతు నులిమి ఆపై పెట్రోల్ పోసి ఘాతుకం

దీక్షిత్ రెడ్డిని శనిగపురం గ్రామానికి చెందిన మెకానిక్ గా పనిచేసే మంద సాగర్ కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేసి తిరిగి వదిలిపెడదామన్న ఉద్దేశంతో తీసుకు వెళ్ళాడని కానీ ఈ విషయం అందరికీ తెలుస్తుంది అన్న భయంతో హతమార్చాడని చెప్తున్నారు పోలీసులు . మత్తుమందు ఇచ్చి బాలుడిని కిడ్నాప్ చేసిన రోజే తాళ్ల పూసల పల్లి పరిసరాల్లోకి వెళ్లేసరికి దొరికిపోతాను అనే భయంతో కిడ్నాప్ చేసిన ఒకటి, రెండు గంటల్లోనే బాలుడిని, దానమయ్య గుట్ట పైకి తీసుకు వెళ్లి గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి బాలుడు శరీరాన్ని దహనం చేశాడు.

 ఒక్క వ్యక్తే ఇదంతా చేసాడన్న ఎస్పీ కోటిరెడ్డి ... వదిలిపెట్టేది లేదన్న ఎస్పీ

ఒక్క వ్యక్తే ఇదంతా చేసాడన్న ఎస్పీ కోటిరెడ్డి ... వదిలిపెట్టేది లేదన్న ఎస్పీ

దీక్షిత్ ను కిడ్నాప్ చేసింది , డబ్బు డిమాండ్ చేసింది, ఫోన్లలో పలుమార్లు మాట్లాడింది మంద సాగర్ అనే వ్యక్తి ఒక్కడే అని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన అన్ని సైంటిఫిక్ ఆధారాలను కలెక్ట్ చేస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. ఈ కిడ్నాప్ కేసును ఛేదించడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ , సైబర్ క్రైమ్ టీమ్లు ప్రధాన పాత్ర పోషించాయి.

Recommended Video

Watch Video : Monkey Tries To Kidnap A Kid
కిడ్నాపర్ ఎన్ కౌంటర్ అంటూ ప్రచారం ఈ కేసులో ఇంకేం జరుగుతుందో ?

కిడ్నాపర్ ఎన్ కౌంటర్ అంటూ ప్రచారం ఈ కేసులో ఇంకేం జరుగుతుందో ?

మరోపక్క బాలుడిని హత్య చేసిన కిడ్నాపర్ ను ఎన్కౌంటర్ చేసినట్టుగా బయట ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఈరోజు సాయంత్రం మరోమారు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు గా సమాచారం.
అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తి పోలీసుల అదుపులోనే ఉన్నారా ? మీడియా ముందు నిందితుడిని ప్రవేశపెడతారా ? లేదా అనేది ఈ రోజు సాయంత్రానికి తెలుస్తుంది .

English summary
The kidnapping of a journalist's son in Mahabubabad district has ended in tragedy. The kidnapper killed Deekshith Reddy, poured petrol on him and set him on fire. Mahabubabad district SP Kotireddy clarified that the killers would not be leave under any circumstances. SP Kotireddy said that so far all the evidence is being collected so that the accused can be hanged for sure and 24 people have been inquired so far in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X