హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వైరస్.. ఆ ఇద్దరు కేంద్రమంత్రులకు తెలుగు రాష్ట్రాల బాధ్యతలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఏప్రిల్ 14వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో లాక్ డౌన్ చర్యలు ఎంతవరకు అమలవుతున్నాయి.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా.. వంటి వివరాలు తెలుసుకునేందుకు కేంద్రం రాష్ట్రాల బాధ్యతను పలువురు కేంద్రమంత్రులకు అప్పగించింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల బాధ్యతను కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్,కిషన్ రెడ్డిలకు అప్పగించింది.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఈ ఇద్దరు మంత్రులు కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా కేంద్రం తగు చర్యలు తీసుకోనుంది.

శుక్రవారం(మార్చి 27) నాటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కి చేరింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మెడికల్ బులిటెన్ విడుదల చేసింది. విదేశాల నుంచి దాదాపు 28వేల మంది రాష్ట్రాలకు వచ్చినట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వీరిలో 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామని, కరోనా అనుమానిత లక్షణాలతో 117మందికి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

Kishan Reddy and Nirmala Sitharaman will monitor coronavirus control measures in Telugu states

మరోవైపు తెలంగాణలో గురువారం(మార్చి 26) మరో నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఈ నలుగురు నలుగురు వ్యక్తులు స్థానికులే కావడం గమనార్హం. క్తులు స్థానికులే కావడం గమనార్హం. వీరికి ఎలాంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేదు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 45కి చేరినట్లైంది. కొత్తగా నమోదైన కేసుల్లో ఇద్దరు డాక్టర్లు,కుత్బుల్లాపూర్‌,సికింద్రాబాద్ బౌద్దనగర్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులున్నారు.వైరస్ సోకిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వీరు ఎంతమందిని కలిశారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవలే విదేశాల నుంచి కొత్తగూడెం వచ్చిన డీఎస్పీ కొడుకు ద్వారా.. డీఎస్పీకి,ఆ ఇంట్లో పనిచేసే వంట మహిళకు పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే స్వీడన్ నుంచి హైదరాబాద్‌లోని మణికొండకు వచ్చిన ఓ వ్యక్తి(34) ద్వారా అతని తల్లి(64)కి వైరస్ సంక్రమించింది. లండన్ నుంచి కోకాపేటకు వచ్చిన వ్యక్తి ద్వారా అతని భార్యకు వైరస్ సోకింది. ఇక కరీంనగర్ వచ్చిన ఇండోనేషియా వాసుల ద్వారా ఓ స్థానిక యువకుడికి వైరస్ సోకింది.

English summary
Prime Minister Narendra Modi ordered Union Ministers Nirmala Sitharaman and Kishan Reddy to monitor coronavirus control measures in Telugu states during lock down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X