వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు బుద్ది చెప్పే ఛాన్స్... హరీశ్ రావు అబద్దాలు... రఘునందన్‌ను గెలిపించండి : కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించే గొంతుక అని... ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న వ్యక్తి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ ప్రశ్నించే గొంతుకకు దుబ్బాక ప్రజలు అవకాశం ఇవ్వాలన్నారు. రఘునందన్ వద్ద డబ్బులు లేకపోయినా ప్రజల కోసం పోరాడే తెగింపు ఉందన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బలంగా గొంతు వినిపించగల సత్తా ఆయనకు ఉందని... కాబట్టి ఉపఎన్నికలో ప్రజలు ఆయనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం(అక్టోబర్ 30) దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి క్రాస్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

దుబ్బాకలో బీజేపీ జూటా గేమ్...దిగజారుడు రాజకీయం.. ఇదిగో 10 అబద్దాలు...: హరీశ్ రావుదుబ్బాకలో బీజేపీ జూటా గేమ్...దిగజారుడు రాజకీయం.. ఇదిగో 10 అబద్దాలు...: హరీశ్ రావు

కేసీఆర్‌కు బుద్ది చెప్పే అవకాశం : కిషన్ రెడ్డి

కేసీఆర్‌కు బుద్ది చెప్పే అవకాశం : కిషన్ రెడ్డి

తెలంగాణ భవిష్యత్తుకు దుబ్బాక నాంది అని... టీఆర్ఎస్‌కు,ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ది చెప్పే అవకాశం ప్రజలకు వచ్చిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక కీలక పాత్ర పోషించిందని... కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఏడేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

హరీశ్ రావు అబద్దాలు చెప్తున్నారు : కిషన్ రెడ్డి

హరీశ్ రావు అబద్దాలు చెప్తున్నారు : కిషన్ రెడ్డి

తెలంగాణలో కుటుంబ పాలన,అవినీతి పాలన నడుస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా లేదని మంత్రి హరీశ్ రావు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు అందిస్తున్న రేషన్‌లో కేంద్రం రూ.32 భరిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 మాత్రమే ఇస్తోందని అన్నారు.కేంద్రం తీసుకొచ్చిన పంటల భీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. అసలు ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఏర్పడిందో.. ఆ లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు.

Recommended Video

Kishan Reddy Slams CM KCR For His Comments On Centre

బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు..

రెండోసారి అధికారంలోకి వచ్చినా దళితులకు కేసీఆర్ మొండిచెయ్యే చూపించారని కిషన్ రెడ్డి విమర్శించారు. మూత పడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు తెరిపించలేకపోయారని ప్రశ్నించారు. అసలు బీజేపీ గనుక లేకపోతే వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఆనాడు రాజ్‌నాథ్ సింగ్,సుష్మా స్వరాజ్ తదితరులు పార్లమెంటులో కాంగ్రెస్ మెడలు వంచడంతో తెలంగాణ వచ్చిందన్నారు.

English summary
Union Minister Kishan Reddy appealed Dubbaka constituency voters to vote BJP's candidate Raghunandan Rao in by election on Nov 3rd.He said Raghunandan is a dynamic leader who can fight against the government aggressively.TRS cheated all sections people after winning elections,he alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X