వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల నోట్ల మట్టికొడుతున్నారు: భారత్ బంద్, వ్యవసాయ చట్టాల వ్యతిరేకతపై కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం రైతుల నోట్లో మట్టికొడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులు స్వేచ్ఛగా తమ పంటలను లాభసాటి ధరకు అమ్ముకునేలా తమ ప్రభుత్వం చట్టం తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రైతులకు నష్టం కలిగించేలా రాజకీయ పార్టీలు..

రైతులకు నష్టం కలిగించేలా రాజకీయ పార్టీలు..

సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం రైతుల పంటల అమ్మకంపై ఉన్న ఆంక్షలు తొలగించిందన్నారు. కనీస మద్దతు ధర విషయంలో ఎాలాంటి మార్పు చేయలేదని కిషన్ రెడ్డి తెలిపారు. రైతు చట్టాలపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, రైతులకు నష్టం కలిగించే చర్యలను కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయని విమర్శించారు. నిరసనలతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్ సర్కారు చేతులెత్తేసింది..

కేసీఆర్ సర్కారు చేతులెత్తేసింది..

టీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నిర్వీర్యం చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఎరువుల కొరత లేకుండా చేశామని, రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధరలు కల్పించామన్నారు. సన్న బియ్యం వేయమని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఎరువుల కొరత లేకుండా చేశామని, రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధరలు కల్పించామని తెలిపారు. ఆ బాధ్యతను కేంద్రంపై నెట్టివేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

బీజేపీని ఎదుర్కోలేకే.. కాంగ్రెస్ పార్టీతో కలిసి టీఆర్ఎస్ ఇలా.

బీజేపీని ఎదుర్కోలేకే.. కాంగ్రెస్ పార్టీతో కలిసి టీఆర్ఎస్ ఇలా.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. రైతులకు వ్యతిరేకంగా చట్టాల్లో ఒక్క పదం కూడా లేదన్నారు. మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. రైతులను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుబంధ రైతు సంఘాల బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందన్నారు. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారన్నారు. రుణమాఫీ చేయలేని కేసీఆర్.. రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. రైతులు వీరి ఉచ్చులో పడొద్దని సూచించారు. కాగా, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. చట్టాలను మార్చాలంటూ రైతులు డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. కాగా, భారత్ బంద్‌కు టీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

English summary
kishan reddy on farm laws: fires at kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X