హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎత్తు కోసం నిఖిల్ రెడ్డికి ఆపరేషన్, ఎలాంటి మార్పు లేదు: ఎంసీఐకి ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పొడవు కావాలని రెండు నెలల క్రితం కాళ్లకు ఆపరేషన్ చేయించుకుని, ఇప్పుడు మంచానికే పరిమితమైన సాప్టువేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి అంశాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి గురువారం నాడు ఎంసీఐ (మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా) దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఎత్తు పెంచుతామని చెప్పి సాఫ్టువేర్ ఇంజినీర్ నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసి రెండు నెలలైనా అతని కాళ్లలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. దీని పైన ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. అతనికి ఆపరేషన్ చేసిన గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యం పైన మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు.

కాళ్ల ఆపరేషన్‌పై కుమిలిపోతున్న నిఖిల్ రెడ్డి: ఇంటికి కిషన్ రెడ్డి (పిక్చర్స్)కాళ్ల ఆపరేషన్‌పై కుమిలిపోతున్న నిఖిల్ రెడ్డి: ఇంటికి కిషన్ రెడ్డి (పిక్చర్స్)

రెండు రోజుల క్రితం నిఖిల్ రెడ్డిని కిషన్ రెడ్డి సోమవారం నాడు పరామర్శించిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డి పార్టీకి చెందిన ఇతర నాయకులతో కలిసి నిఖిల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే మంచానికే పరిమితమైన నిఖిల్ రెడ్డిని పరామర్శించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. నిఖిల్ రెడ్డి కాలుకు సంబంధించిన స్కానింగ్ రిపోర్టులను పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Kishan Reddy says they will complaint Nikhil Reddy issue to MCI

నిఖిల్ రెడ్డి అనే యువకుడి కాళ్లు కోసిన డాక్టర్‌ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతురావు మంగళవారం సాయంత్రం గ్లోబల్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు కూడా. ఎత్తు పెరిగేందుకు గ్లోబల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించారు.

అనంతరం నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్దన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రావు తదితరులతో కలిసి లక్డీకపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రి ఎదుట ఆయన భైఠాయించి, ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇంటర్‌నెట్‌లో చూసి తెలిసో తెలియకో ఆసుపత్రికి వస్తే పెద్దలకు సమాచారమివ్వకుండా కాళ్లు ఎలా కోస్తారంటూ నిలదీశారు.

English summary
BJP leader Kishan Reddy says they will complaint Nikhil Reddy issue to MCI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X