హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం ఇంకా ఇస్తుంది.. కానీ, ఇచ్చినవే వాడటం లేదు: కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇతర సమస్యలను పక్కనపెట్టి.. కరోనా నుంచి రక్షించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుకు హితవు పలికారు. ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షల్లో ఫీజులు వసూలు చెయ్యడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వెంటిలేటర్లను పూర్తిగా ఉపయోగించాలని సూచించారు.

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరం

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరం

హైదరాబాద్ ప్రజల ఆందోళనను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి వివరించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణకు అన్ని విధాలా సాయం చేస్తామని హర్షవర్ధన్ భరోసా ఇచ్చారని తెలిపారు. కేంద్ర ఆరోగ్యమంత్రితో భేటీ అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందన్నారు.

తెలంగాణకు కేంద్రం ఇచ్చింది..

తెలంగాణకు కేంద్రం ఇచ్చింది..

హైదరాబాద్, నగర పరిసర జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రికి తెలిపినట్లు చెప్పారు. అవసరమైతే వైద్య బృందాలను పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు. లాక్‌డౌన్, కంటైన్మెంట్ జోన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తెలంగాణకు కేంద్రం 7,14,000 ఎన్-95 మాస్కులు, 2,41,000 పీపీఈ కిట్లు, సుమారు 23 లక్షల హెచ్‌సీక్యూ టాబ్లెట్లు పంపించిందని కిషన్ రెడ్డి వివరించారు.

ఉన్నవాటినే ఉపయోగించడం లేదు..

ఉన్నవాటినే ఉపయోగించడం లేదు..

రాష్ట్రంలో వెంటిలేటర్ల కొరత గురించి కూడా కేంద్రమంత్రికి వివరించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 680 వెంటిలేటర్లు పంపగా, మరో 1220 వెంటిలేటర్లను పంపించేందుకు హర్షవర్ధన్ అంగీకారం తెలిపారని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 487 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడం లేదని ఆరోపించారు.

Recommended Video

YSR 71st Birth Anniversary: ప్రజల గుండెల్లో మహానేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల నివాళి
ఏపీ తరహాలో కరోనా పరీక్షలు పెంచాలి..

ఏపీ తరహాలో కరోనా పరీక్షలు పెంచాలి..


ఢిల్లీ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సూచించారని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించాలని, తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసి కరోనా రోగులకు పడకల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర వైద్య శాఖ తరపున రూ. 215 కోట్లను వైద్య పరికరాల కొనుగోలు కోసం అందించామని కిషన్ రెడ్డి తెలిపారు.

English summary
kishan reddy slams kcr govt on corona issue in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X