హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాళ్ల ఆపరేషన్‌పై కుమిలిపోతున్న నిఖిల్ రెడ్డి: ఇంటికి కిషన్ రెడ్డి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పొడవు కావాలని రెండు నెలల క్రితం కాళ్లకు ఆపరేషన్ చేయించుకుని, ఇప్పుడు మంచానికే పరిమితమైన సాప్టువేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి సోమవారం నాడు పరామర్శించారు.

కాసుల కోసం నిఖిల్ కాళ్లు కోశారు: ఆపరేషన్ ఇలా, సంక్లిష్ట ప్రక్రియ (పిక్చర్స్)

కిషన్ రెడ్డి పార్టీకి చెందిన ఇతర నాయకులతో కలిసి నిఖిల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే మంచానికే పరిమితమైన నిఖిల్ రెడ్డిని పరామర్శించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. నిఖిల్ రెడ్డి కాలుకు సంబంధించిన స్కానింగ్ రిపోర్టులను పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తప్పుడు నిర్ణయం, జాబ్ పోయింది: పొడవు కోసం కాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్‌రెడ్డి ఆవేదన

కాగా, సినీ హీరో నితిన్ మాదిరిగా పొడవు కావాలని రెండు నెలల క్రితం కాళ్లకు ఆపరేషన్ చేయించుకున్న సాప్టువేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి ఇప్పుడు తీవ్ర ఆవేదన చెందుతున్న విషయం తెలిసిందే. తనకు ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్లు తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రెండు రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు.

నిఖిల్ రెడ్డికి పరామర్శ

నిఖిల్ రెడ్డికి పరామర్శ

నిఖిల్ రెడ్డికి ఎత్తు పెంచుతామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆపరేషన్ నిర్వహించిన ఘటన రెండు నెలల క్రితం కలకలం రేపిన విషయం తెలిసిందే.

నిఖిల్ రెడ్డికి పరామర్శ

నిఖిల్ రెడ్డికి పరామర్శ

కాసుల కోసం కక్కుర్తిపడిన వైద్యులు.. ప్రమాదంలో కాలు విరిగిన సందర్భంలోనో, క్యాన్సర్‌ వంటి వ్యాధులతో ఎముకలను తొలగించాల్సి వచ్చినప్పుడో చేయాల్సిన శస్త్రచికిత్సను ఎత్తు పెంచాలని కోరిన నిఖిల్ రెడ్డికి చేశారు.

నిఖిల్ రెడ్డికి పరామర్శ

నిఖిల్ రెడ్డికి పరామర్శ

మూడు అంగుళాల ఎత్తు పెంచేందుకు నిఖిల్‌ మోకాళ్ల కింద రెండు చోట్లా గాట్లు పెట్టి కాళ్ల ఎముకలను కట్‌ చేసి, మధ్యలో ఇనుపరాడ్లను బిగించి శస్త్రచికిత్స పూర్తి చేశారు.

నిఖిల్ రెడ్డికి పరామర్శ

నిఖిల్ రెడ్డికి పరామర్శ

క్రమంగా అక్కడ ఎముక వృద్ధి చెందుతుందని, తద్వారా ఎత్తు పెరగవచ్చని శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు నిఖిల్‌కు వివరించారు. కానీ, ఎత్తు పెరగడానికి బదులు అతని కాళ్లు పోయాయి. ఇప్పుడు అతను మంచానికే పరిమితం అయ్యాడు. ఆపరేషన్ పూర్తయి రెండు నెలలు అవుతోంది.

నిఖిల్ రెడ్డి

నిఖిల్ రెడ్డి

రెండు రోజుల క్రితం నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ... ఆపరేషన్ పూర్తై 60 రోజులు గడిచినా నడవడానికి తన కాళ్లు సహకరించడం లేదని ఎంతో ఆవేదన చెందారు. ఈ ఆపరేషన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు చెప్పారని అన్నారు. రెండు రోజుల్లో నడిపిస్తామని చెప్పి ఆపరేషన్ తర్వాత మాట మార్చారని వాపోయారు.

నిఖిల్ రెడ్డి

నిఖిల్ రెడ్డి

ఆపరేషన్‌కు సంబంధించి కూడా తనకు పూర్తి సమాచారాన్ని తెలియజేయలేదని వాపోయారు. ఎత్తు కోసం చేసిన ఆపరేషన్ ఆపరేషన్ విషయంలో వైద్యులు నిబంధనలు పాటించలేదని ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

నిఖిల్ రెడ్డి

నిఖిల్ రెడ్డి

తాను జీవితంలో అతి పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నాయనని ఎంతో ఆవేదన చెందారు. ఆపరేషన్‌కు సంబంధించి కూడా తనకు పూర్తి సమాచారాన్ని తెలియజేయలేదని వాపోయారు.

English summary
BJP leader, MLA Kishan Reddy visits Nikhil Reddy residence on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X