వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలకలం: నేతలు, అభిమానుల తాకిడి, భద్రత కట్టుదిట్టం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాంనగర్‌లోని దత్తాత్రేయ ఇంటికి నేతలు, అభిమానుల తాకిడి పెరిగింది.

బుధవారం ఫిజియోథెరపీ ముగించుకుని దత్తాత్రేయ హాల్‌లోకి వచ్చారు. కాగా, బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిమానులు ఆయనతో ఫొటోలు దిగుతుండగా.. తోపులాట జరిగింది.

 Knife Found in Bandaru Dattatreya Home

ఈ క్రమంలో అక్కడ చిన్నపాటి కత్తి(పెన్సిల్ కట్టర్) పడిపోయింది. గుర్తించిన కార్యకర్తలు దాన్ని దత్తాత్రేయ వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. ఈ నేపథ్యంలో దత్తాత్రేయ నివాసంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, మాజీ డీజీపీ హెచ్‌జే దొరతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు దత్తాత్రేయను కలిసి అభినందనలు తెలియజేశారు.

సీఎం జగన్ వినతులకు కేంద్రం నో: శ్రీలక్ష్మి తో సహా మరో ఆరుగురు అంతే..కారణం అదేనా..!!సీఎం జగన్ వినతులకు కేంద్రం నో: శ్రీలక్ష్మి తో సహా మరో ఆరుగురు అంతే..కారణం అదేనా..!!

తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న దత్తాత్రేయ రెండుసార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన ఆయనకు మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రి పదవి లభించింది. అంతకుముందు అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలోనూ దత్తాత్రేయ కేంద్రమంత్రిగా పనిచేశారు.

2019లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. పని చేసే కార్యకర్తలకు బీజేపీలో ఎప్పుడూ న్యాయం జరుగుతుందని, ఇందుకు తాను ఉదాహరణ అని బండారు దత్తాత్రేయ ఇటీవల వ్యాఖ్యానించారు. తనను గవర్నర్‌గా నియమించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

English summary
Sword Knife Found In Bandaru Dattatreya House Police Alerted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X