హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఇక బిందాస్‌గా ఉండొచ్చునేమో! ఆయనే గెలుస్తాడని కత్తి-బియ్యం జోస్యం!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పలు సంస్థలు సర్వేలు చేశాయి, చేస్తున్నాయి. ఎక్కువ సర్వేలు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెబుతుండగా, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.

ఆయా పార్టీలకు చెందిన నేతలు, నాయకులు కూడా తమ తమ అంచనాలు వేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి.. అభ్యర్థులకు ఉన్న బలం, సామాజిక వర్గం, చివరి నిమిషంలో టిక్కెట్ రాకపోవడంతో ఇతర పార్టీలలోకి వెళ్లిన కీలక నేతల ప్రభావం... ఇలా పలు అంచనాలతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలను రాజకీయాలపై అవగాహన ఉన్న వారు వేసుకుంటున్నారు.

నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ?: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ?: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!

కత్తి-బియ్యం జోస్యం

కత్తి-బియ్యం జోస్యం

అలాగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. అభిమానులు, కార్యకర్తలు తమ తమ నేత, తమ తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు జ్యోతిష్యాన్ని కూడా ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఓ వ్యక్తి బియ్యం, కత్తితో ఎవరు గెలుస్తారంటూ జోస్యం చెప్పాడు! అతను దీనిని సరదాగా చేసినట్లు కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎవరు గెలుస్తారని ఇలా చేశారు

ఎవరు గెలుస్తారని ఇలా చేశారు

ఈ కత్తి - బియ్యం జోస్యం సంఘటన ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియదు. కానీ ఓవ్యక్తి తెలంగాణ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అంటూ బియ్యం ఉన్న శేరులో కత్తిని గ్రుచ్చుతాడు. మొదట కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.. కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ కత్తిని బియ్యంలో పెడతాడు. ఆ తర్వాత కత్తిని పైకి తీస్తాడు. బియ్యం ఉన్న శేరు అక్కడే ఉంటుంది.

తెలంగాణ గెలుస్తుంది

తెలంగాణ గెలుస్తుంది

ఆ తర్వాత తెలంగాణ గెలుస్తుంది.. తెలంగాణ గెలుస్తుంది అంటూ మరోసారి కత్తిని బియ్యంలో ఉంచుతాడు. ఆ తర్వాత తెలంగాణ గెలుస్తుంది అంటూ కత్తిని పైకి లేపుతాడు. అప్పుడు ఆ కత్తితో పాటు బియ్యంతో సహా శేరు కూడా పైకి లేస్తుంది. ఇలా అతను సరదాగా తెరాస గెలుస్తుందని జోస్యం చెప్పాడు.

సరదా కోసం.. ట్రిక్

ఆయన తెలంగాణ గెలుస్తుంది అని చెప్పాడు. తెలంగాణ అంటే చాలామంది ఇప్పటికి కేసీఆర్ నేతృత్వంలోని తెరాసకే అనువయించుకుంటున్నారు. కానీ తెలంగాణ వచ్చినందున, ప్రత్యేక రాష్ట్రం అయినందున దానిని అందరూ అలా అన్వయించుకోలేరు. అలాగే, అతను తన అభిమాన పార్టీ కోసమో లేక సరదా కోసమో చిన్న ట్రిక్ చేసి ఉంటాడు. ఏదైనా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

English summary
The Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly. The incumbent Telangana Rashtra Samithi, the Indian National Congress, Telangana Jana Samithi, and Telugu Desam Party are considered to be the main contestants in the election.Four opposition parties in the state, the INC, the TJS, the TDP and the CPI have announced the formation of a 'MahaKootami' (Grand Alliance), with an objective of defeating the ruling TRS in the elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X