హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీ పోలింగ్ స్టేషన్ కనుక్కోవడం ఎంతో సులభం: 'నా ఓటు'ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : 'నా ఓటు'యాప్‌.. పూర్తి వివరాలు మీకోసం..! | Oneindia Telugu

హైదరాబాద్: ఓటరు, పోలింగ్ బూత్ సమాచారం కోసం ఇటీవల 'నా ఓటు' యాప్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని గత గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సచివాలయంలో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు సులువుగా చేరుకునేలా రూపొందించారు.

'నా ఓటు' పేరిట రూపొందించిన ఈ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరు, పోలింగ్ కేంద్ర వివరాలను తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గం, సౌకర్యాల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌పాంలోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఈపీఐసీ) నెంబరును పేరుతో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.

Know ho to use Naa Vote app in Telangana Assembly elections?

'నా ఓటు' యాప్ డౌన్‌లోడ్ చేసి దానిని ఓపెన్ చేసుకోవాలి. అందులో 'సెర్చ్ బై'ని ఓపెన్ చేసి 'ఎపిక్' (EPIC-ఓటరు కార్డు నెంబర్) నెంబర్ టైప్ చేయాలి. ఎపిక్ నెంబర్ టైప్ చేశాక ఆ తర్వాత 'కాప్చా' నెంబర్ టైప్ చేసి, 'సెర్చ్' చేస్తే మీ పేరు, ఎపిక్ నెంబర్, తండ్రి పేరు, వయస్సు, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం.. తదితర అన్ని వివరాలు వస్తాయి.

కుడివైపు పైన మీ ఎపిక్ నెంబర్ పక్కన ఓ కన్ను గుర్తు వంటిది ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే మీ ఓటరు వివరాలు వస్తాయి.

అక్కడే కింద నీలం రంగులో డబ్బాలో (బాక్స్) మీరు ఓటు వేసే పోలింగ్ బూత్ వివరాలు ఉంటాయి. దాని పైన క్లిక్ చేస్తే నేవిగేటర్‌కు వెళ్లి, అక్కడి నుంచి మీ పోలింగ్ బూత్‌కు దారి చూపిస్తుంది. కాగా, 'నా ఓటు' యాప్‌ను ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

English summary
Know ho to use 'Naa Vote' app in Telangana Assembly elections? Telangana EC released this app last thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X