వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోదండరామ్ రాజకీయ పార్టీ రేపే: తెలంగాణ జన సమితి?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారైంది. కొత్త పార్టీ ఏర్పాటు చేయాల్సిన అనివార్యత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిందని కోదండరామ్ స్వయంగా చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటుపై రేపు (ఆదివారం) జరిగే విస్తృత స్థాయి సమావేశంలో ఓ ప్రకటన చేస్తామని చెప్పారు.

దానిపై చర్చించాల్సిందేమీ లేదని, రేపు పార్టీ ప్రకటన ఉంటుంందని చెప్పారు. కొత్త పార్టీకి రకరకాల పేర్లు సూచిస్తున్నారని, దానిపై కూడా త్వరలోనే ప్రకటన చేస్తామని కోదండరామ్ చెప్పారు.

Kodandaram

అదివారం తుర్కయంజాల్‌లోని సామా శ్రీనివాస రెడ్డి గార్డెన్‌లో తెలంగాణ జెఎసి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని చెప్పారు. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం వరకు రైతు సమస్యలపై, ప్రభుత్వం ముందు ఉంచాల్సిన డిమాండ్లపై, రైతు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చిస్తామని వివరించారు

రాజకీయ పార్టీ పెట్టినా కూడా తెలంగాణ జెఎసి కొనసాగుతుందని చెప్పారు. రేపటి సమావేశంలో జెఎసి నేతలతో పాటు పలువురు సామాజికవేత్తలను, నిపుణులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినట్లు తెలిపారు.

పార్టీ పేరును తెలంగాణ జన సమితి (టిజెఎస్) అని పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ విధివిదానాలపై, లక్ష్యం, మార్గం తదితర అంశాలపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. అందుకే రాజకీయ పార్టీ గురించి కొత్తగా చర్చించాల్సిందేమీ లేదని కోదండరామ్ అన్నారు.

పార్టీ గుర్తు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. రైతు నాగలి గుర్తుతో పార్టీ చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జన సమితితో పాటు తెలంగాణ సకల జనుల పర్టీ, తెలంగాణ ప్రజా సమితి పేర్లు కూడా చర్చలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ ప్రజా సమితి ్నే పేర్లను జెఎసి నేతలు, వారికి సన్నిహిత సంబంధాలున్న వారి పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తులు వెళ్లాయి. అయితే, తెలంగాణ సకల జనుల పార్టీ పేరు పొడవుగా ఉందని, పలకడానికి సులభంగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఇక తెలంగాణ ప్రజా సమితి గతంలో ఉన్నదే. దీంతో తెలంగాణ జన సమితి పేరు వైపు కోదండరామ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏవైనా సాంకేతిక ఆధారాలు ఆటంకంగా మారితే తప్ప తెలంగాణ జన సమితి పేరు ఖరారు కావడానికే ఎక్కువ అవకాశాలున్నాయి.

English summary
Telangana JAC chairman Kodandaram will announce his political party tomarrow. It may Telangana Jana Samthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X