వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాత్రకు బ్రేక్: నాయినితో భేటీ, కాసేపటికే కోదండరాం అరెస్ట్

అమరుల స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్‌ వెళ్తున్న రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్‌కేసర్‌ జోడిమెట్ల వద్ద ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కీసర పోలీసుస్టేషన్‌కు తరలించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అమరుల స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్‌ వెళ్తున్న రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్‌కేసర్‌ జోడిమెట్ల వద్ద ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కీసర పోలీసుస్టేషన్‌కు తరలించారు.

అంతకుముందే మంత్రి నాయినిని కలిసిన కోదండరాం

అంతకుముందు తెలంగాణలో ఆరో దశ స్ఫూర్తియాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆయన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని జేఏసీ బృందంతో వెళ్లి కలిశారు.

kodandaram arrested at ghatkesar

నల్గొండ జిల్లాలో స్ఫూర్తియాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమ యాత్రకు అనుమతి ఇవ్వకుండా జేఏసీ ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మంత్రికి వవరించినట్లు కోదండరాం తెలిపారు.

అయితే నాయిని నుంచి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదని.. అనుమతి అంశంపై డీజీపీతో మాట్లాడతానని చెప్పారని వివరించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా తాము మాత్రం యాత్రను చేపట్టితీరుతామని స్పష్టం చేశారు. అయితే, నాయినితో భేటీ అయిన కాసేపటికి కోదండరాంను అరెస్ట్ చేయడం గమనార్హం.

English summary
Telangana JAC chairman Prof. Kodandaram has been arrested at ghatkesar on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X