• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహాకూటమిలో బీటలు: 25 సీట్లిస్తే ఉంటానంటూ కోదండరాం కాంగ్రెస్‌కు అల్టిమేటమ్

|

కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, వామపక్షాలు ఒక్కటయ్యాయన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలోకి దించారు గులాబీ బాస్ కేసీఆర్. ప్రచారంలో ఇప్పటికే కారు దూసుకెళుతోంది. ఇక టీడీపీ కూడా 19 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. ఇక కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి సీట్ల బేరం కుదుర్చుకునేందుకు చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే మహాకూటమితో చర్చలకు హాజరుకానున్నారు కోదండరాం. ఇది హాట్ హాట్‌గా జరిగే అవకాశం ఉంది.

తెలంగాణ జనసమితికి 25 సీట్లు కావాలి: కోదండరాం

తెలంగాణ జనసమితికి 25 సీట్లు కావాలి: కోదండరాం

కేసీఆర్ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారంటూ పేర్కొంటూ కోదండరాం తెలంగాణ జనసమితి పేరుతో కొత్త పార్టీ పెట్టారు. ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించేందుకు బీజేపీ మినహాయిస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇతర పార్టీలు అన్నీ ఏకమయ్యాయి. ఇందులో భాగంగానే కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపేందుకు సిద్ధపడింది. కోదండరాం 25 సీట్లు కావాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ ముందుంచారు. అయితే ఇందుకు కాంగ్రెస్ అస్సలు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. తనది న్యాయపరమైన డిమాండ్ అని కోదండరాం చెబుతున్నారు. తను ఆషామాషీగా తమ పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వమని అడగడం లేదని.. తమ అభ్యర్థుల బలాన్ని అంచనా వేశాకే అడుగుతున్నట్లు కోదండరాం క్లారిటీ ఇచ్చారు.

3 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వలేమంటున్న కాంగ్రెస్

3 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వలేమంటున్న కాంగ్రెస్

ఇదిలా ఉంటే ప్రస్తుతానికి 12 సీట్లు కచ్చితంగా కావాలంటున్నారు కోదండరాం. మిగతా సీట్లపై తరువాత చర్చిద్దామని అన్నారు. సీట్ల పంపకాల విషయంలో మాత్రం తాను చాలా స్పష్టతతో ఉన్నట్లు కోదండరాం చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ తాము అడిగిన సీట్లను ఇవ్వకుంటే మరో ప్రత్యామ్నాయమూ ఉందంటూ చిన్న హింట్ ఇచ్చారు తెలంగాణ జనసమితి నేత. ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాత్రం కోదండరాం పార్టీకి 3 సీట్లు కంటే ఎక్కువ స్థానాలు కేటాయించే అవకాశం కన్పించడం లేదు. అంతేకాదు కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీచేసే యోచనలో ఉంది. మరోవైపు పొత్తు ఎందుకంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కమిటీ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు లైఫ్ అండ్ డెత్‌లా మారాయి. ఇందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా రిస్క్ తీసుకుని రాజీకి వచ్చే ప్రయత్నమూ చేయడం లేదు.

కోదండరాం కోసం తలుపులు తెరచి పెట్టిన బీజేపీ

కోదండరాం కోసం తలుపులు తెరచి పెట్టిన బీజేపీ

కాంగ్రెస్‌తో చర్చలు విఫలమై కోదండరాం బీజేపీ వైపు వస్తారేమోనని కమలం పార్టీనేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కోదండరాం బీజేపీ వైపు వస్తే తమకు కలిసొస్తుందని నేతలు చెబుతున్నారు. కోదండరాం స్టార్ క్యాంపెయినర్‌గా కూడా పనికొస్తారని చెబుతున్నారు. అంతేకాదు తాను అనుకున్న అన్ని సీట్లలో కోదండరాం పోటీచేసే వీలుంటుందని కమలనాథులు చెబుతున్నారు. కోదండరాం చెబుతున్నట్లు కాంగ్రెస్‌తో డీల్ కుదరకుంటే... మరో ప్రత్యామ్నాయం బీజేపీనే ఉంటుందని విశ్వసనీయ సమచారం. ఇందులో భాగంగానే కోదండరాం బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

అంతా అనకున్న ప్రకారం జరిగితే కోదండరాం మహాకూటమిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కోదండరాం మరో పార్టీతో జత కట్టే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There seems to be a split in the Grand alliance led by congress in Telangana. Telangana Janasamithi leader Kodandaram had demanded 25 seats in order to stay in the alliance. But sources say that congress is in no position to allocate the requested seats. In this backdrop BJP is eyeing on Kodandaram party and is of the hope that he would knock the party's door.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more