వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌పై కోదండరామ్ ఫైట్: ఫేస్‌బుక్‌లో హాట్ డిబేట్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పాలనకు రెండేళ్లు గడిచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాలనపై తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ బహిరంగ విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ వివాదంపై చర్చ సాగుతోంది. రెండేళ్ల పాటు కాస్తా అటూ ఇటుగా వ్యవహరిస్తూ వచ్చిన కోదండరామ్ ఒక్కసారిగా కెసిఆర్ పాలనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ సమాజం ఉలిక్కి పడింది.

ఫేస్‌బుక్కును వేదికగా చేసుకుని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆ అభిప్రాయాలపై వాడిగా వేడిగా చర్చ కూడా సాగుతోంది. ఆ వ్యాఖ్యలు ఆయనకు వ్యతిరేకంగానూ అనుకూలంగానూ ఉన్నాయి. అలాంటి వ్యాఖ్యలను కొన్నింటిని కింద ఇస్తున్నాం, చదవండి.

కోదండరాం సర్ తెరాస ప్రభుత్వ పని తీరుపై చేసిన స్వీపింగ్, సంచలన వ్యాఖ్యలు తెలంగాణా వాదులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసాయి. గత పది, పదిహేనేళ్ళుగా తెలంగాణా ఉద్యమంలో, అంతకు ముందు Naxalite ఉద్యమాలతో అలసి సొలసి ఉన్న తెలంగాణా సమాజానికి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఎంతో ఊరటనిచ్చింది. కొన్నాళ్ళు ప్రశాంతంగా వ్యక్తిగత జీవితాలను సర్దుకోవచ్చు అనుకుంటున్న సమయంలో మళ్ళీ యుద్ధానికి సిద్ధం కమ్మనే సైరన్ కూతలా అన్పించింది. కానీ మరో ఉద్యమానికి, మరో యుద్ధానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా?

అలా అని "ఆల్ ఇస్ వెల్", బంగారు తెలంగాణా వచ్చేసిందనే బ్రమలో కూడా ప్రజలు లేరు. కానీ, ఖచ్చితంగా ఆశతో ఉన్నారు. త్వరలో అన్నీ సర్గుకుంటాయి మన ప్రభుత్వం వచ్చింది, మనకు మంచి జరుగుతుందనే ఆశతో ప్రభుత్వానికి ఎక్కడికక్కడ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ప్రభుత్వ పని తీరుకు ఇస్తున్న కితాబుగా భావించలేం.
ప్రజలు ప్రభుత్వాన్ని, జాక్ ని రెండు కళ్ళుగా అనుకొంటున్నారు. మనం దృష్టి సారించినప్పుడు, ఆ రెండు కళ్ళు ఒక వైపు చూస్తేనే ఏదైనా చూడగలుగుతాం. అలా కాకుండా ఒక కన్ను ఒక వైపు, ఒక కన్ను మరో వైపు చూడడం సాధ్యం కాదు. కానీ, ఆ పరిస్థితి ఈనాడు తెలంగాణా సమాజానికి వచ్చింది. ప్రజలకు జాక్ పై ప్రేమ ఉంది, ప్రభుత్వం పై ఆశ ఉంది. నాన్న బాద్యతతో కావాల్సింది ఇవ్వాలి. లేకపోతే అమ్మతో కంప్లైంట్ చేస్తాం. అమ్మ నుండి ప్రేమ ఆశిస్తాం. అమ్మ నాన్నకి సిఫారసు చేసి సాధిస్తుంది. ఇది సహజంగా జరగాల్సిన విషయం. అలా కాకుండా అమ్మా, నాన్న పోట్లాడుకొని విడాకులు తీసుకొంటే పిల్లల పరిస్థితి ఏమి?

ఇది భావోద్వేగాల సమస్య. సగటు తెలంగాణా వాది నలిగిపోతాడు. నువ్వు అటో ఇటో తేల్చుకో అన్నట్టుంది పరిస్థితి. దయచేసి బుద్ధిజీవులు ఒక అడుగు వెనక్కు వేసి ఆలోచించవలసిందిగా మనవి.

Kodandaram fight on KCR: Comments trends in social media

- రవి ప్రకాష్ మేరెడ్డి

ఉపఎన్నికల్లో వచ్చిన విజయాలన్నీ "go ahead" certificate అనుకుంటే పొరపాటే. బుద్ది జీవులు వేరే విధంగా ఆలోచిస్తున్నారని వరదారెడ్డి ఓటమి రాంచందర్ రావు గెలుపు పల్లా గుడ్డిలో మెల్ల ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా చూడాలి. JAC ఒక వాచ్ డాగ్ లాగా ఉంటే ఉలికిపడడమెందుకు. ఆయా గ్రామాల్లో జరిగిన మిషన్ కాకతీయను వ్యక్తిగతంగా పరిశీలిస్తే కొంత సమాచారాన్ని మనం సేకరించి ఓ రిపోర్ట్ తయారు చెయ్యాలి. అది మంచి కాని చెడు కాని దీనితో కొంతవరకు ఓ అభిప్రాయానికి రావొచ్చు.

అమరేందర్ వెల్లాల

కోదండరామ్‌ గారి ప్రస్తుత వైఖరి

ఆంధ్రా నాయకుల కబంధ హస్తాలనుంచి వేరుపడి తెలంగాణ తెచ్చుకొని రెండు అంటే రెండు యేండ్లు అయ్యింది. కొన్ని దశాబ్దాల ఆంధ్రా నాయకుల పాలనలో తెలంగాణ లో ఉన్న 10 జిల్లాల్లో 9 కరువు జిల్లాలే. తీవ్రమైన విద్యుత్ సమస్య, నీటి సమస్య, డ్రైనేజీ సమస్య. అసలు ఏ వ్యవస్థ తీసుకున్నా అస్థవ్యస్థం గా ఉంది. 50 యేండ్ల కు పైగా దోపిడీ కి గురి అయ్యింది తల్లి తెలంగాణ.

ఇన్ని సమస్యల మధ్య వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్క సమస్య ని పరిష్కరించలేక చతికలబడిపోతుంది అనుకున్నారు కారణం 50 యేండ్ల కు పైగా పరాయి పాలనలో ఉన్న తెలంగాణ దోచుకోబడింది. అన్ని రంగాలలో వెనకవేయడింది.
KCR గారి ప్రభుత్వం దేశం లో ఎవరూ ఊహించని రీతిలో కొద్ది కాలం లోనే విద్యుత్ సమస్య ని తీర్చింది. నీటి సమస్య ని పరిష్కరించటానికి అపర భగీరధుడి లా క్రుషి చేస్తున్నారు. తెలంగాణ లో ఉన్న ప్రతి చెరువు ని తవ్వించారు. పక్క రాష్ట్రాల వాళ్లతో మాట్లాడి పరిష్కారానికి క్రుషి చేస్తున్నారు.

మనకు ట్యాక్స్ ద్వారా వచ్చిన ఆదాయం 56,130 కోట్లు. కేంద్రం ఇచ్చిన గ్రాంటు 12,000 కోట్లు. ఆంధ్ర లో పోలవరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించారు. ఖర్చు అంతా కేంద్రమే బరిస్తుంది. తెలంగాణ లో నీటి సమస్య తీవ్రం గా ఉన్నా ఒక్క ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించే స్తితి లో లేదు కేంద్రం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కే మనకి 70, 000 వేల కోట్లు అవుతుంది.
ఇరిగేషన్ కి, డ్రింకింగ్ వాటర్ కి 3 లక్షల కోట్లు పైనే అవుతాయి( For next 5 years). కేంద్రం సహాయం చేయటం లేదు.

రోడ్లు సరిగ్గా లేవు. హైవే లు లేవు. అన్ని జిల్లా కేంద్రాలను కలుపుతూ రైల్వే వ్యవస్థ లేదు.అందరూ కలిసి సమస్యల పరిష్కారానికి క్రుషి చేయాల్సిన తరుణం ఇది KCR గారు, KCR గారి ప్రభుత్వం అత్యంత సమర్ధవంతం గా పనిచేస్తుంది. కొన్ని సార్లు 24 గంటలు పనిచేసే మంత్రులు ఉన్నారు.

అవును, సమస్యలు చాలా ఉన్నాయి. పరిష్కరించాలంటే కొంత సమయం పడుతుంది. 2 యేండ్ల ప్రభుత్వాన్ని పట్టుకొని చేతకాకపోతే దిగిపో అనటం ఎంత వరకు సబబు..? భారతదేశం లోనే అత్యంత సమర్ధవంతం గా పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణది.

కోదండరామ్‌ గారి వైఖరి వందకి వంద శాతం తప్పు. నేను తీవ్రం గా ఖండిస్తున్నా. తొందరపడి ఒక కోవెల ముందే కూచింది.కోదండరామ్‌ గారి ప్రస్తుత వైఖరి ని యావన్ మంది తెలంగాణ సమాజం ఖండించాల్సిన సమయం ఇది.
గమనిక: కామెంట్స్ చెస్తే Please stick to the point. I am ready to discuss.

-జగన్ రావు

వ్యవసాయం కోసం ఏమి చెయ్యడం లేదు,మళ్ళా కాంట్రాక్టు లు అన్ని ఆంధ్రోల్లకే ఇస్తున్నారు,మన సంస్కృతి ని కాపాడే పండుగలు చెయ్యడం లేదు - ఇవి కోదండరామ్ సర్ విమర్శలు.

సర్ మిమ్మల్ని విమర్శించే హౌకాత్ లేదు కానీ మీ ఈ విమర్శలు సరిగ్గలేవు అని చెప్పగలుగుతా ఎందుకంటే !!
" మన రాష్ట్రము లోనే కాదు దేశం లోని పెద్ద పెద్ద రోడ్ లు కానీ,ప్రాజెక్ట్ లు కానీ కట్టేది ఆంధ్ర కాంట్రాక్టర్ లే ఎందుకంటే ఆ శక్తి,తాహాతు వాళ్ళకే ఉన్నది ఇప్పుడు మన దగ్గర కడుతున్న ప్రాజెక్ట్ లు అన్ని పెద్దవే కాబట్టి అర్హత ను బట్టి వాళ్లకు వస్తున్నాయి మరియు ప్రాజెక్ట్ టెండర్ లు అన్ని పారదర్శకంగా ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి "
" వ్యవసాయం మీద ద్రుష్టి పెట్టడం లేదు అనేది మీ వాఖ్య సర్ ప్రాజెక్ట్ లు కడుతున్నది వ్యవసాయం కోసమే,ఖరిఫ్ విత్తనాలు,ఎరువులు రెడీ గా పెట్టిండ్రు ,కరంట్ ఫుల్ గా ఇస్తున్నారు..రైతు చైతన్య సభలు పెట్టి అన్ని నేర్పిస్తున్నారు ఇంకా ఏమేమి చేయాలనో అని ఆలోచనలు చేస్తున్నారు"

తెలంగాణ సంస్కృతి పండగలు చెయ్యడం లేదు ...బతుకమ్మ మన పండగా కాదా,తెలంగాణ కు పెద్ద పండుగా అయిన దసరాకు ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా..ఈ వారం మొత్తం తెలంగాణ వంటకాల ఫుడ్ ఫెస్టివల్స్ జర్గుతున్నాయి కదా,తెలంగాణ చరిత్రను పాఠ్య పుస్తకాలలో పెట్టడం నిజం కాదా ??"

సర్ మీరు అంటే మాకు అత్యంత గౌరవం మిమ్మల్ని మీరు తగ్గించుకొని మమ్మల్ని బాధ పెట్టకండి.

- కొత్తపల్లి సంతోష్ రెడ్డి

గౌరవనీయులైన ఆచార్య కోదండరాం సార్ గారూ..

మా సందేహాలు నివృత్తి చేయగలరు.

◆ 2012 లో జరిగిన పాలమూరు ఉప ఎన్నికల్లో అప్పటి జేఏసీ భాగస్వాములైన టీఆర్ఎస్,బీజేపీలు పరస్పరం తలపడ్డాయి..
ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 2009 లో టీఆర్ఎస్ ని వీడి నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ చేత్తో కండువా వేసుకున్న కాంగ్రెస్ నాయకుడు.. రాత్రికి రాత్రి బీజేపీ టికెట్ సంపాదించిన అవకాశవాది.
టిఆర్ఎస్ అభ్యర్థి 2009 లో అతితక్కువ తేడాతో ఓడిన మైనారిటీ నేత.
కానీ మీ నిర్వాకం ఏంది.. తటస్థం అంటూనే స్థానిక జేఏసీ లతో బీజేపీ కి మద్దతు.
ప్రచారంలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ని రజాకార్ల పార్టీ అని, టీఆర్ఎస్ కి ఓటేస్తే పాకిస్థాన్ కి వేసినట్లని దుర్మార్గపు నిందలేసినా, తెలంగాణ సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడినా మీరు స్పందించిన దాఖలాలు లేవు.. పైగా రాజకీయాల్లో సహజం అన్నట్లు మాట్లాడలేదా.
◆ 2014 ఎన్నికల కంటే ముందే కొందరు జేఏసీనేతలను తీసుకుని ఢిల్లీ లో చేసిన వ్యవహారాలు ఏమీ లేవంటరా..
◆ 2014 ఎన్నికలలో కొందరు టీఆర్ఎస్ ముఖ్యనాయకులను ఓడించడానికి జేఏసీ ల ముసుగులో జరిగిన కుట్రలు మీకు తెలియవని నమ్మమంటారా..
◆ టీఆర్ఎస్ కి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడాలని మీరు బలంగా కోరుకున్నది నిజం కాదా ...

ఉద్యమంలో మీ కృషి పట్ల ఉన్న గౌరవంతో మర్యాదగానే వ్యవహరిస్తున్నం

మీ... రాజావరప్రసాద్

కలియుగం అంటే ఇదేకావచ్చు !
తెలంగాణ ఉద్యమ ఊపిరిని ( ప్రొఫెసర్ కోదండరాం సారును ) చివరకు తెలంగాణ ద్రోహిగా చేసి మాట్లాడం ఎవరికీ మంచిది కాదు!

కోదండరాం సర్ మంచి, చెడు గురించి మాట్లాడే స్వేచ్ఛ 100% ఉంది, మన ప్రభుత్వం వాటిని సూచనలు, సలహాలుగా తీసుకోవాలి , కానీ విమర్శలుగా తీసుకోకూడదు.!

-సురేందర్ తాళ్లపల్లి

English summary
Debate is going on in socila media like Facebook on the Telangana political JAC chairman Kodandaram fight on Telangana CM K chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X