హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మమ్మల్ని పిలవలేదు: కేసీఆర్‌పై కోదండ సంచలనం, ఓయులో టెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిమిత్తం తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని, అలాగే ఏ ఉద్యమకారుడికీ రాలేదని చెప్పారు.

బుధవారం అర్దరాత్రి గన్ పార్కు వద్ద కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు.

కోదండరామ్

కోదండరామ్

తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికో రోజుల కోసం తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఆయన కెసిఆర్ పాలన పైన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

కోదండరామ్

కోదండరామ్

ఆత్మబలిదానం చేసుకున్న ఉద్యమకారులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ఒక విధానం రూపొందించాలన్నారు. అది ఉద్యమకారులందరికీ వర్తించేలా ఉంటే బాగుంటుందన్నారు. 1969 నాటి ఉద్యమకారుల గురించి ఆలోచించాల్సిన అవసరముందన్నారు.

కోదండరామ్

కోదండరామ్

గతంలో అభివృద్ధిని గురించి మాట్లాడుకుంటే కాంట్రాక్టర్లు, కార్పోరేట్ శక్తుల కోసం అన్నట్లు ఉండేదన్నారు. ఇప్పుడు అభివృద్ధి హైదరాబాదుకే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో జరగాలని, ఇందుకు ఉద్యమస్ఫూర్తితో పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

కోదండరామ్

కోదండరామ్

ఆ జాబితాను సిద్ధం చేసినట్లు ఎక్కడా ప్రకటించలేదని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పరవాలేదని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.

కోదండరామ్

కోదండరామ్

రాష్ట్ర ఏర్పాటు అనేది తెలంగాణ అభివృద్ధికి ఉన్న అవరోధాలను తొలగించుకోవడమే అన్నారు. రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆ లక్ష్యాన్ని పరిపూర్ణం చేసుకోవాల్సి ఉందని చెప్పారు.

ఓయు

ఓయు

ఇదిలా ఉండగా, ఓయులో గురువారం హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఓయులో సంబరాలకు చెక్ పెట్టింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్సిటీలో సంబరాలకు తావు లేదని రిజిస్ట్రార్ ప్రకటించారు. సంబరాలు జరుపుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు మాత్రం బైక్ ర్యాలీగా గన్ పార్కుకు బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

English summary
Telangana JAC chairman Kodandaram Gives Positive Report on KCR Rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X