వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోదండరామ్ ఎక్కడినుండి పోటీ చేస్తారంటే, ఎందుకో తెలుసా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గంపై కోదండరామ్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

119 స్థానాల్లో ఒంటరిపోరు, అందుకే కెసిఆర్ సర్వేలు, పార్టీ ఎందుకు పెట్టానంటే?: వన్ఇండియాతో కోదండరామ్119 స్థానాల్లో ఒంటరిపోరు, అందుకే కెసిఆర్ సర్వేలు, పార్టీ ఎందుకు పెట్టానంటే?: వన్ఇండియాతో కోదండరామ్

తెలంగాణ జెఎసి ఛైర్మెన్‌గా ఉన్న ప్రోఫెసర్ కోదండరామ్ తెలంగాణ జనసమితి పేరుతో పార్టీని ప్రారంభించారు. తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 29వ తేదిన సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలను నిర్వహించేందుకు తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేసినట్టు కోదండరామ్ ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జనసమితి 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు కోదండరామ్ ప్రకటించారు.

జనగామపై దృష్టి

జనగామపై దృష్టి

తెలంగాణ జనసమితి 2019 ఎన్నికల్లో తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొంది.అయితే ఒంటరిగానే ఇప్పటివరకు పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అయితే జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎక్కడి నుండి కోదండరామ్ పోటీ చేస్తారనే విషయమై ఆ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఆ జిల్లాపైనే కేంద్రీకరణ

ఆ జిల్లాపైనే కేంద్రీకరణ

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలపై తెలంగాణ జనసమితి కేంద్రీకరించినట్టు సమాచారం. జనగామతో పాటు, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పట్టును పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టిని బలోపేతం చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు.మరో వైపు తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా కీలకంగా ఉంది. ఈ తరుణంలో ఈ జిల్లాలో తమ పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని తెలంగాణ జనసమితి నేతలు భావిస్తున్నారు.ఈ కారణంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాపై కేంద్రీకరించారనే ప్రచారం సాగుతోంది.

బహిరంగసభలో ప్రకటన

బహిరంగసభలో ప్రకటన

తెలంగాణ జనసమితి ఏప్రిల్ 29న సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో పార్టీ విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో పార్టీ ఏ రకంగా రానున్న రోజుల్లో వ్యవహరించనుంది. పార్టీ లక్ష్యాలేమిటీ, విధి విధానాలేమిటనే విషయమై ఈ సభ ద్వారా కోదండరామ్ ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ జనసమితిలో చేరే అవకాశం

తెలంగాణ జనసమితిలో చేరే అవకాశం

ఎన్నికల సమయంలో పలు రాజకీయపార్టీల్లోని అసంతృప్తులు తెలంగాణ జన సమితిలో చేరే అవకాశం లేకపోలేదని తెలంగాణ జనసమితి నేతలు ఆశాభావంంతో ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో వారు ఏ రకంగా వ్యవహరించారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొన్న మీదట పార్టీలోకి ఆహ్వనించనున్నారు. అయితే ఇప్పటికే కొందరు నేతలు కోదండరామ్‌తో టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

English summary
There is chance to Telangana jana samithi founder Kondaram contest from jangaon assembly segment in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X