వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌‌ కళ్యాణ్‌పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు, ఏకిపారేసిన టీకాంగ్రెస్ నాయకులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై టీజేఏసీ చైర్మన్ కోదండరాం మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పొగడడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై టీజేఏసీ చైర్మన్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి తన స్థాయిని తాను తగ్గించుకోదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం జిల్లాలో తెలంగాణ రైతాంగ సమస్యలు-కార్యాచరణపై జేఏసీ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు హాజరైన సందర్భంగా జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడారు.

pawan-and-others

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలనుకుంటున్నారని, అదేగనుక జరిగితే ఆంధ్రావాళ్లకే లాభం చేకూరుతుందన్నారు. రైతు సమస్యలపై ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేస్తామని.. ఈ సమావేశంలోనే కార్యాచరణ సిద్ధం చేస్తామని కోదండరాం చెప్పారు.

''సీఎం పాలన బాగుంటే.. పవన్ తిరగడమెందుకు?''

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పొగడడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలన అంత బాగుంటే టీఆర్ఎస్‌లో జనసేన పార్టీని విలీనం చేసుకోమని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సలహా ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన సీఎం అయినప్పుడు, ఆయన పాలన అంత బాగున్నప్పుడు.. పవన్ కళ్యాణ్ తెలంగాణ జిల్లాల్లో తిరగాల్సిన అవసరం ఏమిటని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు.

English summary
TJAC Chairman Kodandaram passed sensational comments about Janasena Chief Pawan Kalyan here in Karimnagar on Tuesday. While speaking in a farmers meeting Kodandaram said that he don't want to reduce his own image by talking about Pawan Kalyan. On the other hand Telangana Congress leaders V.Hanumantha Rao and Jeevan Reddy also slamed Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X