వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కేసీఆర్ పాలనలో సమైక్య 'వాదన', తెలంగాణ ఉద్యమానికి అవమానం'

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం మంగళవారం నాడు కేసీఆర్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిలదీసిన ప్రశ్నలపై చర్చ జరుగుతోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం మంగళవారం నాడు కేసీఆర్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిలదీసిన ప్రశ్నలపై చర్చ జరుగుతోంది.

నిరుద్యోగ జేఏసీ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు, ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం చూపించిన కారణాలను కోదండరాం తీవ్రంగా తప్పుబట్టారు.

 Kodandaram says No democracy in TRS government

ఏ సమైక్యాంధ్ర ప్రభుత్వం అయితే తమ పైన కేసులు పెట్టి, ఏం చెప్పిందే ఇప్పుడు అవే కారణాలను తెలంగాణ ప్రభుత్వం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ప్రభుత్వం చూపిన కారణాలనే ఈ ప్రభుత్వం చూపి.. ర్యాలీని అడ్డుకోవడం ఏమిటని అభిప్రాయపడ్డారు.

ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణలో సమైక్య 'వాదన' (కేసుల గురించి) వినిపిస్తోందన్నారు. తమ వెనుక నేర చరిత్ర ఉందని కోర్టుకు పోలీసులు చెప్పడాన్ని కోదండరాం తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం కొరవడుతోందన్నారు. తాము ముందు అనుకున్నట్లుగా రేపు ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపడతామన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై కోదండరాం నిప్పులుకేసీఆర్ ప్రభుత్వంపై కోదండరాం నిప్పులు

జేఏసీ నేతల పైన నేరపూరిత కేసులు ఉన్నాయని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ కేసులు తెలంగాణ ఉద్యమం సమయంలో పెట్టినవి. తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ పోలీసులు నేరంగా చూపిస్తున్నారన్నారు. అంతేకాదు, అవే కేసులు కొన్ని కేసీఆర్ పైన కూడా ఉన్నాయన్నారు.

English summary
Telangana JAC chairman on Tuesday said that Telangana police are talking about our cases, which are put in Samaikyandhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X