వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారిగా ఒకే వేదికపై డికె అరుణ, రేవంత్: కెసిఆర్‌పై యుద్దానికి సై

By Narsimha
|
Google Oneindia TeluguNews

కొడంగల్: టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి డికె అరుణ ఒకే వేదికను పంచుకొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో బుదవారం సాయంత్రం నిర్వహించిన రేవంత్ ఆత్మీయ సమ్మేళనంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

కొడంగల్: ఆ రెండు పార్టీల నేతలపై టిఆర్ఎస్ వల, రేవంత్‌కు చిక్కులేనా?కొడంగల్: ఆ రెండు పార్టీల నేతలపై టిఆర్ఎస్ వల, రేవంత్‌కు చిక్కులేనా?

కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరిన తర్వాత ఆ పార్టీకి చెందిన సీనియర్లతో రేవంత్ సమావేశమౌతున్నారు. పార్టీలో చేరడానికి ముందే రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డికె అరుణను కలిశారు.

రేవంత్‌ పార్టీలో చేరడాన్ని నేనేందుకు వ్యతిరేకిస్తా: డికె అరుణ రేవంత్‌ పార్టీలో చేరడాన్ని నేనేందుకు వ్యతిరేకిస్తా: డికె అరుణ

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి డికె అరుణతో కలిసి రేవంత్‌రెడ్డి ఒకే వేదికను పంచుకొన్నారు.

 ఒకే వేదికపై రేవంత్‌రెడ్డి, డికె అరుణ

ఒకే వేదికపై రేవంత్‌రెడ్డి, డికె అరుణ

రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణ కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఒకే వేదికను పంచుకొన్నారు.రేవంత్‌రెడ్డి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంత్రిగా డికె అరుణ ఉన్నారు. ఆ సమయంలో నిర్వహించిన డిఆర్‌సి సమావేశంలో మంత్రి డికె అరుణతో రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది.వీరిద్దరి మధ్య వారం రోజుల పాటు మాటల యుద్దం సాగింది. అయితే రేవంత్‌ ప్రస్తుతం పార్టీ మారారు. దీంతో రేవంత్‌తో పాటు డికె అరుణ ఒకే వేదికను పంచుకొన్నారు.

 రెండు పార్టీలతో సమన్వయ కమిటీ

రెండు పార్టీలతో సమన్వయ కమిటీ

కొడంగల్ నియోజకవర్గంలోరానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పర్యటిస్తానని రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి వచ్చిన వారి నుంచి ఇద్దరిని కలిపి నలుగురితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలందరూ కలిసి మెలిసి పనిచేయాలన్నారు.

 కొడంగల్‌లో మళ్ళీ జెండా ఎగురవేస్తాం

కొడంగల్‌లో మళ్ళీ జెండా ఎగురవేస్తాం

కొడంగల్‌లో మళ్ళీ జెండాను ఎగురవేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2009 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి రేవంత్‌రెడ్డి తొలిసారిగా పోటీ చేశారు. కాంగ్రె

స్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన గుర్నాధ్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడ టిడిపి అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అయితే రేవంత్‌రెడ్డి ఈ స్థానం నుండి రాజీనామా చేశారు. కానీ, రాజీనామా లేఖ స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. రేవంత్ రాజీనామా ఆమోదం పొందితే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తానని రేవంత్ ధీమాను వ్యక్తం చేశారు.

 దోపిడి పాలనకు చరమగీతం పాడాలి

దోపిడి పాలనకు చరమగీతం పాడాలి

రాష్ట్రంలో సాగుతున్న దోపిడీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం చాలా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీ.కే.అరుణ అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు సైతం విరివిగా నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష కొనసాగుతుందని డికె అరుణ విమర్శలు గుప్పించారు.

English summary
First time former minister Dk Aruna along with Revanth reddy participated Congress meeting. Revanth reddy followers held at meeting at Kosgi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X