వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పినా వెళ్లాడు: బాబు వ్యాఖ్య, కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి పైన టీడీపీ జాతీయ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కలుస్తానని రేవంత్‌కు చెప్పానని, కానీ ఆయన వెళ్లిపోయారని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేవంత్ రెడ్డి పైన టీడీపీ జాతీయ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కలుస్తానని రేవంత్‌కు చెప్పానని, కానీ ఆయన వెళ్లిపోయారని చెప్పారు.

రేవంత్ రెడ్డి ఔట్: ఇంకా టీడీపీకి కేసీఆర్ జీవం పోస్తారా??రేవంత్ రెడ్డి ఔట్: ఇంకా టీడీపీకి కేసీఆర్ జీవం పోస్తారా??

రాజీనామా ఇచ్చారట కదా అని శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రాజీనామా ఇచ్చారా నాకు తెలియదే అన్నారు. అదే సమయంలో టీడీపీకి ఇలాంటివి కొత్త కాదని చెప్పారు.

బాబుకు అన్నీ చెప్పేశా, ఇప్పుడే అసలు ఆట మొదలు: కేసీఆర్‌కు రేవంత్ హెచ్చరికబాబుకు అన్నీ చెప్పేశా, ఇప్పుడే అసలు ఆట మొదలు: కేసీఆర్‌కు రేవంత్ హెచ్చరిక

రేవంత్‌ను దెబ్బకొట్టేందుకు కేసీఆర్ తాయిలాలు

రేవంత్‌ను దెబ్బకొట్టేందుకు కేసీఆర్ తాయిలాలు

మరోవైపు, చంద్రబాబుతో ఎలాంటి ఇబ్బంది లేదని, కేసీఆర్‌తో అంటకాగుతున్న తెలంగాణ టీడీపీ, ఏపీ టీడీపీ నేతలతో ఇబ్బంది అని రేవంత్ రెడ్డి సన్నిహితుల వద్ద వాపోతున్నారట. తనను దెబ్బ కొట్టేందుకు ఏపీ టీడీపీ నేతలకు కేసీఆర్ తాయిలాలు ఇస్తున్నారని వాపోతున్నారు.

రేవంత్ రెడ్డిపై కేసీఆర్ వ్యూహం, కానీ

రేవంత్ రెడ్డిపై కేసీఆర్ వ్యూహం, కానీ

ఇదంతా గమనించినందు వల్లే రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీని విడిచిపెట్టారని చెబుతున్నారు. టీడీపీ నేతలకు తాయిలాలు ప్రకటించి తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ వ్యూహం పన్నుతున్నారని ఆయన గుర్తించారని చెబుతున్నారు.

నా పోరాటానికి విలువ ఏముంది

నా పోరాటానికి విలువ ఏముంది

కొందరు ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారని, అలాంటప్పుడు కేసీఆర్ పైన తన పోరాటానికి విలువ ఎక్కడిదని ఆయన వాపోతున్నారు. అందుకే తాను చంద్రబాబుకు అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసి రాజీనామా చేశానని చెబుతున్నారని తెలుస్తోంది. చంద్రబాబుకు చెప్పిన తర్వాతనే తాను టీడీపీకి రాజీనామా చేశానని రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా ఎదుగుదల చంద్రబాబు వల్లే

నా ఎదుగుదల చంద్రబాబు వల్లే

తన ఎదుగుదలకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు కొందరు తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నేతలతో చేతులు కలిపి టీడీపీని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సన్నిహితుల వద్ద ఆవేదన

సన్నిహితుల వద్ద ఆవేదన

తాను కేసీఆర్‌పై పోరాటం చేస్తుంటే కొందరు ఏపీ, టీడీపీ నేతలు ఆయనతో సమావేశం కావడం, కొందరు టీఆర్ఎస్‌తో లాలూచీ పడి కాంట్రాక్టులు తెచ్చుకోవడం జరిగిందని, అలాంటప్పుడు నా పోరాటానికి విలువ ఎక్కడ ఉంటుందని, తనను దెబ్బకొట్టడం కోసం కేసీఆర్ టీడీపీ నేతలకు తాయిలాలు ఇస్తున్నారని సన్నిహితుల వద్ద కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తన స్వార్థం కోసం తాను పార్టీని ఎప్పుడూ అడ్డుపెట్టుకోలేదని, స్వార్థం కోసం పార్టీని వీడటం లేదని రేవంత్ చెబుతున్నారు.

English summary
In what could be the first major battle to test the voter pulse before the 2019 elections, the stage is set for a bitter contest for the Kodangal assembly constituency between Congress and ruling TRS. And Revanth Reddy, who switched sides to the Congress on Saturday, will be at the vanguard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X