వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌కు షాక్: టిడిపిలోనే అనురాధ, ఆ కుటుంబంపైనే పార్టీల దృష్టి

By Narsimha
|
Google Oneindia TeluguNews

కొడంగల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికపై ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే నందారం సూర్యనారాయణ కుటుంబం కీలకపాత్ర ఫోషించనుంది. నందారం సూర్యనారాయణ కుటుంబంపై ప్రధాన పార్టీలన్నీ కేంద్రీకరించాయి.

Recommended Video

రేవంత్‌లో ఓటమి భయం : డిసెంబర్ 9న ముహూర్తం

రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నందారం కుటుంబానికి మంచి పట్టుంది. అయితే ఆ కుటుంబం చాలా కాలంగా టిడిపిలోనే ఉంది. రేవంత్ రెడ్డి టిడిపిని వీడినా కానీ, నందారం అనురాధ మాత్రం టిడిపిలోనే ఉంటానని ప్రకటించారు.

కొడంగల్: ఆ రెండు పార్టీల నేతలపై టిఆర్ఎస్ వల, రేవంత్‌కు చిక్కులేనా?కొడంగల్: ఆ రెండు పార్టీల నేతలపై టిఆర్ఎస్ వల, రేవంత్‌కు చిక్కులేనా?

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు ఓటములను నందారం కుటుంబం ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కొడంగల్‌లో ఆ కుటుంబానికి పట్టు

కొడంగల్‌లో ఆ కుటుంబానికి పట్టు

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నందారం సూర్యనారాయణ కుటుంబానికి మంచి పట్టుంది. నందారం సూర్యనారాయణ కంటే ముందు నందారం వెంకటయ్య ఈ అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు. నందారం వెంకటయ్య, సూర్యనారాయణలు ఈ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఎమ్మెల్యేగా టిటిడి సభ్యుడిగా ఉన్న నందారం సూర్యనారాయణ యాదగిరిగుట్ట నుండి తిరుగు ప్రయాణంలో ఉండగా 2003లో భువనగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2009 నుండి ఈ అసెంబ్లీ స్థానం నుండి రేవంత్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా విజయం సాధిస్తున్నారు.

ఇండిపెండెంట్‌గా నందారం వెంకటయ్య ఎమ్మెల్యే

ఇండిపెండెంట్‌గా నందారం వెంకటయ్య ఎమ్మెల్యే

1972లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి నందారం వెంకటయ్య స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత 1985లో ఈ అసెంబ్లీ స్థానం నుండి నందారం వెంకటయ్య టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గుర్నాద్‌రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు.అయితే 1989లో టిడిపి అభ్యర్థిగా రత్నాలాల్ లాహోటీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో నందారం వెంకటయ్యకు టిడిపి టిక్కెట్టు దక్కలేదు.1994లో వెంకటయ్య మరోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గుర్నాధ్‌రెడ్డిపై విజయం సాధించారు.అయితే నందారం వెంకటయ్య మరణించడంతో 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో నందారం సూర్యనారాయణ టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు.1999లో జరిగిన ఎన్నికల్లో కూడ సూర్యనారాయణ మరోసారి ఈ స్థానం నుండి విజయం సాధించారు. సూర్యనారాయణ టిటిడి సభ్యుడిగా కూడ ఉన్నారు. 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.2009 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పోటీ చేసే సమయంలో నందారం అనురాధ కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు.

నందారం కుటుంబసభ్యులతో రేవంత్ భేటీ

నందారం కుటుంబసభ్యులతో రేవంత్ భేటీ

అమరావతిలో పార్టీ సమావేశానికి హజరై అక్కడే పార్టీకి రాజీనామా లేఖను ఇచ్చిన రేవంత్ రెడ్డి మరునాడు కొడంగల్‌లో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళే సమయంలో తొలుత తన సతీమణితో కలిసి రేవంత్ రెడ్డి నందారం అనురాధతో సమావేశమయ్యారు.రేవంత్ కుటుంబసభ్యులతో కలిసి స్థానిక ఆలయానికి అనురాధ కూడ హజరయ్యారు. తనకు మద్దతును కొనసాగించాలని రేవంత్ అనురాధ కుటుంబసభ్యులను కోరినట్టు సమాచారం. అయితే తాము టిడిపిలోనే ఉంటామని అనురాధ ప్రకటించారు.ఈ నియోజకవర్గంలో నందారం కుటుంబానికి పట్టుంది. అయితే నందారం కుటుంబసభ్యులు ఎవరికీ ఈ ఎన్నికల్లో మద్దతిస్తే ఆ పార్టీ గెలుపు సునాయాసంగా మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే సూర్యనారాయణ సోదరుడు కొడుకు ప్రశాంత్ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కీలకంగా మారారు. అయితే అదే సమయంలో ప్రశాంత్‌ చేజారకుండా రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.

నందారం కుటుంబంపై పార్టీల కేంద్రీకరణ

నందారం కుటుంబంపై పార్టీల కేంద్రీకరణ

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నందారం కుటుంబసభ్యులపై ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రీకరించాయి. ఈ మేరకు టిఆర్ఎస్ నేతలు కూడ నందారం కటుంబసభ్యులను టిఆర్ఎస్‌లోకి ఆహ్వనించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలోనే నందారం అనురాధ తాము టిడిపిని వీడేది లేదని ప్రకటించడం గమనార్హం. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొడంగల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశమే కన్పించడం లేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

English summary
TRS and Congress leaders planning to strenthen party in Kodangal Assembly segment. Nandaram Suryanarayana family key role in politics from long back. So parties trying for the support of Nandaram family for elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X