ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీ మొదటి స్థానంలో నిలిచేది: భద్రాద్రి జిల్లాలో కోడెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: సమైక్యాంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఏపీ అన్ని రంగాల్లో మొదటిస్థానంలో ఉండేదని ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సాధించుకునే వరకు పోరు సాగుతుందని చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనగడప గ్రామంలో దివంగత మంత్రి కోనేరు నాగేశ్వర రావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

Kodela Siva Prasada Rao tour in Bhadradri Kothagudem district

అనంతరం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడారు. టీడీపీ సాయం లేకుండా ఏ రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేదని చెప్పారు. కొత్తగూడెంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన కోనేరు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆయన చివరి కోరికను సాధించి తీరుతామన్నారు.

రాజ్‌నాథ్‌తో నేడు కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా చర్చించిన 11 అంశాలను హోంమంత్రితోనూ చర్చిస్తారు.

నూతన జోనల్‌ విధానానికి ఇప్పటికే హోం, న్యాయశాఖల ఆమోదం లభించిన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులు వీలైనంత త్వరగా జారీ అయ్యేలా చూడాలని కోరనున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సీఎం కేసీఆర్‌ కలిసి పరామర్శించే అవకాశముంది.

English summary
Andhra Pradesh Assembly Speaker Kodela Siva Prasada Rao tour in Bhadradri Kothagudem district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X